ఎయిరిండియాకు చెందిన విమానంలో ఓ ఇంజిన్ చెడిపోడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
భోపాల్: ఎయిరిండియాకు చెందిన విమానంలో ఓ ఇంజిన్ చెడిపోడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం ఉదయం ఎయిరిండియా విమానం 634ను భోపాల్లోని రాజ భోజ్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు.
ఈ రోజు ఉదయం 8:15 గంటలకు ఈ విమానం భోపాల్ విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో ఇంజిన్ చెడిపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానాశ్రయ సిబ్బంది వెంటనే మరమ్మత్తు చేయడంతో కాసేపటి తర్వాత విమానం ముంబైకి బయల్దేరింది. కాగా సాంకేతిక, ఇతర సమస్యల వల్ల ఎయిరిండియా విమానాలు గమ్యస్థలం చేరకుముందే మార్గమధ్యంలో వెనక్కివచ్చిన సంఘటనలు ఉన్నాయి.