సాక్షి, ముంబై: బ్రెయిన్‌డెడ్ వల్ల మరణించిన ముగ్గురు రోగుల బంధువులు సరైన సమయంలో అవయవదానం చేయడం వల్ల 38 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలను డాక్టర్లు నిలబెట్టగలిగారు. ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన దాదాపు 50 మంది వైద్యులు ఈ అవయాలను సేకరించారు. అవసరమైన రోగులకు అమర్చి వారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందుకు గాను జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ (జెడ్‌టీసీసీ) కూడా తమ సహకారం అందజేసింది.
మృతదేహాల నుంచి చట్టబద్ధంగా అవయవాలను సేకరించే వారికి ఈ సంస్థ తోడ్పాటునిస్తోంది. బ్రెయిడ్‌డెడ్ అయిన వారి దేహాల నుంచి అవయవాలను దానం చేస్తే చాలా ఉపయోగముంటుందన్న విషయంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని సీనియర్ డాక్టర్ ఒకరు పేర్కొన్నారు. ఇదిలా వుండగా, గత ఏడాది నగరంలో 20 శవదానాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 41 కిడ్నీ దానాలు, 20 కాలేయదానాలు (ఆర్గాన్ డొనేషన్) నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2013లో 36 కిడ్నీ దానాలు, 19 కాలేయదానాలు నమోదయ్యా యి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 36,791 అవయవదానాలు నమోదయ్యాయని జెడ్‌టీసీసీ తెలిపింది.
గత ఏడాదితో పోల్చితే ఈసారి ముంబైలో శవదానాలు 20 నుంచి 23 వరకు నమోదయ్యాయి. కిడ్నీల కోసం 3,079 మంది వెయిటిం గ్ లిస్టులో ఉండగా, కాలేయం కోసం 212 మంది బాధితులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఖార్‌కు చెందిన ఓ 58 ఏళ్ల మహిళ ఇటీవల మరణించగా, ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ అవయవాలను ఈ మహిళ కూతురు పీడీ హిందుజా ఆస్పత్రికి అందజేశారు. అయితే తాను మరణించిన తర్వాత కళ్లను దానం చేయాల్సిందిగా తల్లి కోరినట్లు ఆమె పేర్కొంది. మిగతా వాళ్లు కూడా తమ అవయవాలను దానం చేయాలన్న డాక్టర్ల విజ్ఞప్తికి మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడం విశేషం.
గుండె, ఊపిరితిత్తులు కూడా దానం చేసినట్లు ఆస్పత్రికి చెందిన అవయవ మార్పిడి సమన్వయాధికారి డాక్టర్ సుచేత దలాల్ తెలిపారు. ఇదిలా వుండగా సదరు మహిళ ఇంట్లో వంట చేస్తుండగా మెదడులో రక్తస్రావం కావడంతో స్మృహ తప్పి పడిపోయింది. అయితే ముంబైలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సదుపాయం లేదు. దీంతో కేవలం కిడ్నీలు, కాలేయాన్ని మాత్రమే తీసుకున్నారు.
సదరు మహిళ కిడ్నీని ఓ 53 ఏళ్ల వ్యక్తికి మార్పి డి చేశారు. ఇటీవలే ఇతని కాలేయం, కిడ్నీ పాడైపోవడంతో అతనికి మార్పిడి చేసినట్లు వైద్యురాలు పేర్కొంది. మరోకిడ్నీని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరికి దానం చేసినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు.
అవయవమార్పిడి అద్భుతం
Published Mon, Jul 21 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement