నాన్నకు ప్రేమతో... 472 మంది కూతుళ్లు! | Proud dad of 472 happily married daughters | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో... 472 మంది కూతుళ్లు!

Published Sun, Jun 19 2016 2:16 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

నాన్నకు ప్రేమతో... 472 మంది కూతుళ్లు! - Sakshi

నాన్నకు ప్రేమతో... 472 మంది కూతుళ్లు!

అహ్మదాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా ఒక తండ్రికి  472 మంది కూతుళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంది కూతుర్లేంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ ఇది నిజం. కాకపోతే వాళ్లంతా తండ్రి లేని పిల్లలు. వాళ్లందరికీ ఆయనే తండ్రయ్యాడు. ఆయనే గుజరాత్ కు చెందిన మహేష్ సవాని. పదేళ్ల క్రితం తన తమ్ముడు చనిపోవడంతో అతడి కూతుర్లకు వివాహం చేయడంతో ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు తండ్రిలేని 472 మంది యువతులకు వివాహం జరిపించాడు. ఇందుకోసం ఒక్కొక్కరిపై ఆయన రూ. 4 లక్షలు ఖర్చు చేశాడు.
  
భర్త చనిపోయిన స్త్రీ తన కూతురు పెండ్లి చేయడం చాలా కష్ట సాధ్యమని, అందుకే తానీ వివాహాలు చేస్తున్నానని సవాని తెలిపాడు. 2016 లో 216 మంది యువతులకు వివాహం చేసినట్టు ఆయన చెప్పాడు. తాను వివాహం జరిపించిన వారిలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని వెల్లడించాడు. ఇలాంటి అమ్మాయిలకు సహాయం చేయడానికి తానెప్పుడూ ముందుంటానని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement