సాక్షి, న్యూఢిల్లీ : పేదలందరికీ పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో త్వరలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా తృణధాన్యాలనూ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. పీడీఎస్ ద్వారా ప్రస్తుతం వరి, గోధుమలు సరఫరా చేస్తున్నారు. అయితే వీటికన్నా చౌకగా, పోషకాల పరంగా మెరుగైన తృణధాన్యాలనూ చౌకధరల దుకాణాల్లో పేదలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లోగానే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పీడీఎస్ ద్వారా మిల్లెట్స్‌ను పంపిణీ చేస్తుండగా, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
పీడీఎస్ ద్వారా అందించే సరుకుల్లో మిల్లెట్స్‌ను చేర్చాలని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ త్వరలో కేంద్రానికి సిఫార్సు చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్ కమిటీ ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిందని మరో రెండు వారాల్లో దీనిపై స్పష్టమైన సిఫార్సు చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు త్వరలో రాగి, జొన్న, కొర్రలు వంటి తృణధాన్యాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment