
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఎత్తివేత విషయంలో భారత్ చాలా తెలివిగా వ్యవహరించాలని ఉద్యోగాలను కాపాడేందుకు వీలైనంత వేగంగా ఆచితూచి పునరుద్ధరించాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్ల వరకూ ఖర్చు చేయాలని సూచించారు. కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని, పరిణామాలపై రాజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. దేశంలోని అన్ని వర్గాల వారిని దీర్ఘకాలం సాయం అందించే సామర్థ్యం భారత్‌కు లేదని, లాక్‌డౌన్ పొడిగించడం ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని రాజన్ స్పష్టం చేశారు. కోవిడ్ నుంచి బయటపడ్డార ప్రపంచం మొత్తమ్మీద ఆర్థిక వ్యవస్థలోని అన్ని విషయాల్లో పునరాలోచన ఉంటుందని, భారత్ దీన్ని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తన గొంతు వినిపించాలని రాజన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment