రాహుల్ మంచోడు: అఖిలేశ్ | Rahul Gandhi A 'Good Boy', Should Come To UP More, Says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

రాహుల్ మంచోడు: అఖిలేశ్

Published Fri, Sep 9 2016 3:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

రాహుల్ మంచోడు: అఖిలేశ్

రాహుల్ మంచోడు: అఖిలేశ్

లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన గొప్ప మానవతావాదని, మంచి మిత్రుడు కాగలడని కితాబిచ్చారు. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో ఎస్పీతో కాంగ్రెస్ దోస్తీ ఊహాగానాలకు అఖిలేశ్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. ‘రాహుల్ గొప్ప మానవతావాది. మంచివాడు. యూపీలో ఎక్కువ రోజులుంటే నాకూ మిత్రుడవుతాడు’ అని అఖిలేశ్ గురువారమిక్కడ అన్నారు. ‘యువ సీఎం అఖిలేశ్ మంచివాడు. కానీ అతని ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు’ అని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement