
భీవండి కోర్టుకు హాజరైన రాహుల్
ముంబయి : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో ఆయన కోర్టు విచారణకు వచ్చారు. మహత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసు వేశాడు. అయితే ఈ కేసు విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సూచించినా రాహుల్ మాత్రం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ ' నేను చట్టాన్ని గౌరవిస్తా, కోర్టుకు వస్తానని చెప్పా, మాటకు కట్టుబడి ఉన్నాను కాబట్టి వచ్చా' అని అన్నారు.