పరువు నష్టం కేసు: కోర్టుకు రాహుల్
ముంబై: పరువు నష్టం కేసులో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్రలోని భివండి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్కు చెందినవారే మహాత్మా గాంధీని హత్య చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడు రాజేష్ కుంటే.. ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజే రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన ఇక్కడి నుంచి గోవా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.