భీవండి కోర్టు వద్ద రాహుల్ గాంధీ
థానే : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టులో హాజరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మ గాంధీ హత్యతో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు సంబంధం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ అప్పట్లో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. రాజేశ్ కుంతే అనే స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు. ఆరెస్సెస్ కూడా రాహుల్ తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో.. రాహుల్‌ను జూన్ 12వ తేదీన తమ ముందు హాజరవ్వల్సిందిగా కోర్టు పేర్కొంది. గతవారం కాంగ్రెస్ నేత నిరూపమ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భీవండి కోర్టుకు హాజరవుతారని తెలిపారు. తొలుత ఈ కేసుపై వెనుకంజ వేసినట్టు కనిపించిన రాహుల్.. తర్వాత కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. భీవండి కోర్టుకు హాజరైందుకు ఈ రోజు ఉదయం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment