Bhiwandi court
-
కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
థానే : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టులో హాజరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మ గాంధీ హత్యతో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు సంబంధం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ అప్పట్లో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. రాజేశ్ కుంతే అనే స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు. ఆరెస్సెస్ కూడా రాహుల్ తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో.. రాహుల్‌ను జూన్ 12వ తేదీన తమ ముందు హాజరవ్వల్సిందిగా కోర్టు పేర్కొంది. గతవారం కాంగ్రెస్ నేత నిరూపమ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భీవండి కోర్టుకు హాజరవుతారని తెలిపారు. తొలుత ఈ కేసుపై వెనుకంజ వేసినట్టు కనిపించిన రాహుల్.. తర్వాత కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. భీవండి కోర్టుకు హాజరైందుకు ఈ రోజు ఉదయం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) వేసిన పరువు నష్టం దావా కేసులో తమ ఎదుట హాజరుకావాలని భివండి(మహారాష్ట్ర) కోర్టు కోరింది. 2014 ఎన్నికల ప్రచారంలో భివండిలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ... మహాత్మా గాంధీ మృతి వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంటే పరువు నష్టం దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. జూన్ 12న రాహుల్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆరెస్సెస్ ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని రాజేశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే రాహుల్ లిఖితపూర్వక స్టేట్మెంట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. స్వయంగా విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది నారాయణ అయ్యర్ ధృవీకరించారు. కాగా, ఈ కేసును కొట్టేయాలంటూ గతంలోనే రాహుల్ సుప్రీం కోర్టును అభ్యర్థించగా.. కోర్టు తిరస్కరించింది. ‘ఆరోపణలు నిజం కాని పక్షంలో పిటిషనర్‌కు క్షమాపణలు చెప్పాలని.. అలాకానీ పక్షంలో విచారణను ఎదుర్కోవాల్సిందే’అని అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌కు స్పష్టం చేసింది. అయితే రాహుల్ మాత్రం విచారణకే మొగ్గు చూపారు. -
పరువు నష్టం కేసు: కోర్టుకు రాహుల్
-
పరువు నష్టం కేసు: కోర్టుకు రాహుల్
ముంబై: పరువు నష్టం కేసులో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్రలోని భివండి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్కు చెందినవారే మహాత్మా గాంధీని హత్య చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడు రాజేష్ కుంటే.. ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజే రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన ఇక్కడి నుంచి గోవా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
ముంబయి: పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు అయింది. ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో ఆయన బుధవారం ముంబయిలోని బివండి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు.. ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ... తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 28కి వాయిదా వేసింది. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ 2014 మార్చి 6న బీవండిలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహాత్మా గాంధీ ని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన నిన్న సాయంత్రమే ముంబయి వచ్చారు. బెయిల్ మంజూరు అనంతరం రాహుల్ గాంధీ....పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సామాన్యులు తప్ప, ధనికులు ఎవరూ క్యూలో నిలబడి నగదు తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
భీవండి కోర్టుకు హాజరైన రాహుల్
ముంబయి : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో ఆయన కోర్టు విచారణకు వచ్చారు. మహత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసు వేశాడు. అయితే ఈ కేసు విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సూచించినా రాహుల్ మాత్రం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ ' నేను చట్టాన్ని గౌరవిస్తా, కోర్టుకు వస్తానని చెప్పా, మాటకు కట్టుబడి ఉన్నాను కాబట్టి వచ్చా' అని అన్నారు.