
లక్నో: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనబడుట లేదనే పోస్టర్లు ఆయన సొంత నియోజకవర్గం అమేథిలో కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ ఫోటోతో ‘అమేథి ఎంపీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారో తెలియజేస్తే బహుమానం అందజేస్తామని’ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. అమేథి ఓటర్లను రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడని అమేథీ ప్రజలు భావిస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇది బీజేపీ పార్టీ పనేనని ఆరోపించారు.