missing posters
-
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’ కనపడుట లేదు.. బీఎల్ సంతోష్‌ను పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం.. అని పోస్టర్లు ఏర్పడ్డాయి. వీటిని నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్ కీలక వ్యక్తి అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అండతో విచారణ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇతడేనని పోస్టర్లను చూసుకుంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సంతోష్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేసి ఉంటారని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటించిన పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారి బీజేపీ సీనియర్ నేత సంతోష్యేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయనపై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను జులై 31కి వాయిదా వేసింది. -
‘పూజా మిస్సింగ్’ అని సెర్చ్ చేసి.. కన్నవాళ్ల చెంతకు చేరింది!
ఇటీవల కాలంలో ఎన్నో మిస్సింగ్ కేసులు గురించి వింటున్నాం. ఆయా కేసుల్లో కిడ్నాప్‌కి గురైన ఒకరో, ఇద్దరో తిరిగి తమ కుటుంబాన్ని కలుసుకోగలుగుతున్నారు. చాలావరకు మిస్సింగ్ కేసుల్లో పిల్లలను చంపడం లేదా అవయవాలు తీసి అడుక్కునే వాళ్లుగా మార్చడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. మరి కొందరిని బాల కార్మికలుగా మార్చుతున్నవారు లేకపోలేదు. అచ్చం అలానే అమ్మాయి ఏడేళ్ల వయసులో తప్పిపోయింది. టీనేజ్ వయసులో తన కుటుంబాన్ని కలుసుకోగలిగింది. అదెలా సాధ్యమైందంటే... వివరాల్లోకెళ్తే.... జనవరి 22, 2013న ముంబైలో పూజా అనే ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌కి గురైంది. పూజాకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. హెన్రీ జోసెఫ్ అనే వ్యక్తి తనకు పిల్లలు కలగకపోవడంతో పూజా అనే ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీం కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి అపహరించాడు. ఎవరికి అనుమానం రాకూడదని ఆ చిన్నారిని కొద్ది రోజుల పాటు కర్ణాటకలోని ఒక హాస్టల్లో ఉంచాడు. పైగా ఆ చిన్నారి పూజా పేరుని అన్నీ డిసౌజాగా పేరు మార్చాడు. కొద్ది రోజుల తర్వాత జోసెఫ్ భార్యకి పిల్లలు కలగడంతో తాను కిడ్నాప్ చేసిన అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకువచ్చేశాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయిని పని అమ్మాయిగా ఇంట్లో చాకిరి చేయించడం మొదలుపెట్టాడు. ఐతే జోసెఫ్ ఒకరోజు తాగిన మత్తులో అసలు విషయం బయటపెట్టాడు.. దీంతో ఆ అమ్మాయి తన వాళ్ల ఆచూకి కోసం ప్రయత్నిచడం ప్రారంభించింది. ఆమెకు కూడా తన కుటుంబం గురించి పెద్దగా గుర్తులేదు. అయినప్పటికీ తన గతం తాలుకా ఆధారాల కోసం గాలించడం మొదలు పెట్టింది. పూజా మిస్సింగ్ అని తన స్నేహితురాలితో కలిసి ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలుపెట్టింది. చివరికి 2013వ ఏడాదికి సంబంధించి ఒక డిజిటల్ మిస్సింగ్ పోస్టర్ని కనుగొన్నారు. అందులో ఐదు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. కానీ వాటిలో నాలుగు నెంబర్లు పనిచేయడం లేదు. అదృష్టవశాత్తు ఒక్క నెంబర్ పనిచేస్తుంది. అది పూజా కుటుంబం పొరుగున ఉండే రఫీ అనే వ్యక్తిది. ఐతే ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా అతనికి చెబుతుంది. దీంతో అతను పూజా వాళ్ల కుటుంబానికి ఈ విషయం చెప్పి పూజా వాళ్ల అమ్మ చేత కూడా మాట్లాడించడం తోపాటు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జోసెఫ్ని, అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సదరు నిందితుడు అప్పట్లో తన భార్యకు పిల్లలు కలగక పోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు పోలీసుల సదరు అమ్మాయిని తన కుటుంబం చెంతకు చేరుస్తారు. 16 ఏళ్ల తర్వాత తప్పిపోయిన తన కూతురు తిరిగి తమ వద్దకు చేరడంతో పూజా తల్లి ఆనందానికి అవధులే లేకుండా పోయింది. ఐతే ఈ సుదీర్ఘ విరామంలో పూజా తన తండ్రిని కోల్పోవడం బాధాకరం. (చదవండి: చంపడం ఎలా? అని సర్చ్ చేసి మరీ ....) -
అయ్యా సారూ.. మా ఎంపీ, ఎమ్మెల్యే మిస్సింగ్.. కనిపిస్తే చెప్పండి
కోల్కత్తా: ఎన్నికల సందర్భంగా మీకు మేమున్నామంటూ ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచాక ప్రజాప్రతినిధులు మోహం చాటేస్తారు. దీంతో ప్రజలు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్బాలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. తాము ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిథులు ఆపద వచ్చినప్పుడు అండగా నిలవకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రజలు, నేతలు మండిపడుతున్నారు. అయితే, ఇటీవలే అలీపూర్దువార్లో తుఫాన్ కారణంగా భారీ నష్టం జరిగింది. ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తమను పరామర్శించలేదని ప్రజలు, రాజకీయ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన జాన్ బార్లా, ఫలకటా ఎమ్మెల్యే దీపక్ బర్మన్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించారు. వెంటనే వారి ఆచూకి తెలపాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: ‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’ -
స్మృతి ఇరానీ కనిపించడం లేదు!
అమేథి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కనిపించడం లేదంటూ అమేథీలో మిస్సింగ్ పోస్టర్లు వెలిశాయి. "ఏడాది కాలంలో ఎంపీ స్మృతి ఇరానీ కేవలం రెండు సార్లే అమేథీకి వచ్చారు. అప్పుడు కూడా కొద్ది గంటలు మాత్రమే ఉన్నారు. నేడు అమేథీ ప్రజలు కరోనాతో విలవిల్లాడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆమె నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని ఆశించాము, కానీ అది జరగడం లేదు" అని ఆ పోస్టర్లలో రాసి ఉంది. దీంతో ఎంపీ ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఈ పోస్టర్లను ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ గత ఎనిమిది నెలల్లో తన నియోజకవర్గానికి పదిసార్లు వెళ్లి పద్నాలుగు రోజులు అక్కడే ఉన్నానని తెలిపారు. (వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!) మరి సోనియా గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో ఎన్నిసార్లు పర్యటించారు? అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు బస్సుల్లో 22,150 మంది వలస కార్మికులు అమేథీకి రాగా 8,322 మంది రైళ్ల ద్వారా చేరుకున్నారు. మరి ఈ కష్ట కాలంలో సోనియా గాంధీ తన నియోజకవర్గానికి ఏం చేశారని విమర్శించారు. కాగా అమేథీలో ఇప్పటివరకు 148 కరోనా కేసులు నమోదవగా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా వుండగా గ్వాలియర్‌లో జ్యోతిరాధిత్య సింధియా, భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. (ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు) -
ఎంపీ కనిపించడం లేదు..వెతకండి
భోపాల్ : ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పరిస్థితిని సమీక్షించాల్సిన ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటూ నగరంలో పోస్టర్లు వెలిశాయి. భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదు..తప్పిపోయిన ఎంపీ కోసం వెతకండి అంటూ వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు కనిపించాయి. ఇప్పటివరకు భోపాల్‌లో 14,000 మందికి కరోనా సోకింది. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కరోనా కష్టకాలంలో ఎంపీ ఎక్కడా కనిపించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ కోసం వెతకండి అంటూ పోస్టర్లు అంటించారు. ఓటర్లు ఓటు వేసే మందు ఆలోచించాలని , కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడలేని ఇలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవద్దు అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలేశ్వర్ పటేల్ అన్నారు. (అగ్నిప్రమాదంలో బీజేడీ నేత ఆలేఖ్ చౌదరి మృతి ) మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మాత్రం ప్రజల కోసం గడియారంలా పనిచేస్తున్నారని, ఎన్నికైన ప్రజాప్రతినిధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ఎంపీ కనిపించడం లేదంటూ వెలిసిన పోస్టర్లపై బిజెపి అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎయిమ్స్‌లో ప్రగ్యా ఠాకూర్ కంటి, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారని అయినప్పటికీ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రజలకు సరుకులు , ఆహారం లాంటివి పంపిణీ చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ కేవలం ఫోటోలకు ఫోజులిస్తూ కరోనాని కూడా రాజకీయం కోసం వాడుకంటున్నారని విమర్శించారు. ఈనెల ప్రారంభంలో ఉప ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆయన కుమారుడు నకుల్ నాథ్ తప్పిపోయారని వీరి ఆచూకీ కనిపెట్టిన వారికి 21,000 రూపాయల రివార్డు కూడా ఇస్తామని ప్రకటిస్తూ కొందరు పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రులు ఇమార్తి దేవి, లఖన్ సింగ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు పెట్టిన ఇద్దరు స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. (బ్లడ్ శాంపిళ్లను ఎత్తుకెళ్లిన కోతులు ) . -
‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’
భోపాల్: మా నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి ఇస్తామంటున్నారు గ్వాలియర్ జనాలు. ఈ మేరకు ఆయన కనిపించడం లేదంటూ వీధుల వెంట పోస్టర్లు అంటించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. -
‘గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఆదివారం ఉదయమే ‘గౌతమ్ గంభీర్ అదృశ్యం’ అని పోస్టర్లను వెలిశాయి. ‘మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనిపించాడు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న పోస్టర్లు, బ్యానర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఉంచారు. భారత్, బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ ఇండోర్ వెళ్లాడు. శుక్రవారం.. వివిఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూ, గంభీర్ కలసి సరదాగా జిలేబీలు తీసుకుంటున్న ఫోటోను అయన ట్వీట్ చేశారు. దీని తరువాత, గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆప్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు గంభీర్ ను విమర్శించాయి. కీలక సమావేశానికి గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా?’ అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. -
రాహుల్ గాంధీ కనబడుటలేదు..!
లక్నో: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనబడుట లేదనే పోస్టర్లు ఆయన సొంత నియోజకవర్గం అమేథిలో కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ ఫోటోతో ‘అమేథి ఎంపీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారో తెలియజేస్తే బహుమానం అందజేస్తామని’ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. అమేథి ఓటర్లను రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడని అమేథీ ప్రజలు భావిస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇది బీజేపీ పార్టీ పనేనని ఆరోపించారు. ఇక రాహుల్ అమేథీ నియోజకవర్గంలో పర్యటించక 6 నెలలవుతుంది. మార్చిలో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాహుల్ అమెథీ రావడానికి సుముఖంగా లేడని తెలుస్తోంది. ఈ పోస్టర్లతో రాహుల్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయడం లేదనే నింద వేస్తున్నారని, త్వరలోనే రాహుల్‌ను కలిసి అమేథీలో పర్యటించేలా చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. -
రాహుల్ తప్పిపోయారండో.. గుర్తిస్తే రివార్డు
లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పిపోయాడంటూ ఉత్తరప్రదేశ్‌లో పలు పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. రాహుల్ తప్పిపోయారు.. గుర్తించినవారికి రివార్డులు కూడా ఇస్తాం అంటూ వాటిల్లో ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గం ఆమేథిలో కూడా ఇవి కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత నెల రోజులుగా రాహుల్‌గాంధీ సెలవుల పేరిట వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు తలెత్తాయి. ఆమేథిలో అయితే తమ భావాలను ఏకంగా ఓ పాట రూపంలో 'జానే వో కౌన్సా దేశ్, జానే తుమ్ చలే గయే' (నువ్వెక్కడికి వెళ్లావో ఎవరికీ తెలుసు) అంటూ ప్రకటించారు. దీంతోపాటు తమ ప్రాంతాల్లోని పాడపోయిన రోడ్లనుగురించి, మంచినీటి సమస్య గురించి ఇలా పలు సమస్యలు జాబితా రూపాల్లో ప్లెక్సీల్లో పొందుపరిచారు. ఆయనతోపాటు బీజేపీ కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా తప్పిపోయారంటూ వీరిద్దరు పలు వాగ్దానాలు చేసి వాటిని అమలుచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు.