మోదీ పిలుపు.. రైల్వే ఉద్యోగుల భారీ విరాళం | Railway Employees To Donate Rs 151 Crore To PM Cares Fund | Sakshi
Sakshi News home page

మోదీ పిలుపు.. రైల్వే ఉద్యోగుల భారీ విరాళం

Published Sun, Mar 29 2020 4:46 PM | Last Updated on Sun, Mar 29 2020 4:49 PM

Railway Employees To Donate Rs 151 Crore To PM Cares Fund - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే ఉద్యోగులు కూడా తమ ఒక్క రోజు జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే  శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. 

‘ప్రధాని మోదీ పిలుపు మేరకు నేను, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌​ అంగాడి మా ఒక్క నెల జీతాన్ని, 13లక్షల మంది రైల్వే , పీఎస్‌యూ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతానాన్ని విరాళంగా ఇస్తున్నాం. రూ. 151 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందజేస్తాం’ అని పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. అలాగే తన సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. మన దేశం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తామంతా ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కాగా, పీఎం కేర్స్‌ ఫండ్‌కు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉండగా, రక్షణశాఖ, ఆర్థిక, హోం శాఖ మంత్రులు సభ్యులుగా  ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement