ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధర పెంపు | Railways to hike AC class fares by 0.5 pc from June 1 | Sakshi
Sakshi News home page

ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధర పెంపు

Published Sat, May 30 2015 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధర పెంపు

ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధర పెంపు

న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. సర్వీసు టాక్స్ను 0.5 శాతం మేర పెంచనున్నారు. అన్ని రకాల సరుకుల  రవాణపై కూడా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.

ఏసీ, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లపై సర్వీసు ఛార్జీలు ప్రస్తుతం 3.708 శాతం ఉండగా, 1వ తేదీ నుంచి 4.2 శాతం మేర వసూలు చేయనున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఉదాహరణకు 1000 రూపాయల ఏసీ టిక్కెట్టుపై అదనంగా 10 రూపాయలు ఛార్జీ వేయనున్నారు. కాగా ఇతర తరగతుల టిక్కెట్ల ధరలు యధాతథంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement