june 1
-
డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది. -
జూన్‌లో 12% పెరిగిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది జూన్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ కింద రూ.1,61,497 కోట్లు వసూలైనట్లు చెప్పారు. రాజ్య సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవా బిచ్చారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు అధిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందన్నారు. తాత్కాలికంగా అనుమతించిన జీఎస్టీ నష్టపరిహారం కింద మొత్తం సొమ్మును కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందని, బకాయిలేమీ లేవని చెప్పారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడిన రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరి హారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలల కోసారి లెక్కించి విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవస్థను బలోపేతం చేస్తేనే మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం: విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం (మీడియేషన్)తో కేసులు పరిష్కరించాలంటే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం బిల్లు–2021పై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే.. అందులో కోటికిపైగా సివిల్ కేసులేనని తెలిపారు. దేశంలో 2022 నాటికి 570 మీడియేషన్ కేంద్రాలు, 16 వేలమంది మీడియేటర్లు ఉన్నారని చెప్పారు. ఈ సివిల్ కేసుల్లో 90 వేల కేసులను మాత్రమే పరిష్కరించగల సామర్థ్యం ప్రస్తుత మీడియేషన్ వ్యవస్థకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని మీడియేషన్ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం పడుతుందన్నారు. వ్యవస్థను వందరెట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం నెరవేరదని చెప్పారు. కమ్యూనిటీ మీడియేషన్ ఈ బిల్లులోని ప్రధాన అంశాల్లో ఒకటని, సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రీ లిటిగేషన్ మీడియేషన్ మాండేటరీపై కేంద్రానికి పలు సూచనలు చేశారు. ప్రీ లిటిగేషన్ మీడియేషన్‌కు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీవవైవిధ్య పరిరక్షణకు తగినన్ని నిధులేవి? విస్తారమైన జీవవైవిధ్యం ఉన్న దేశంలో దాని పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే కేటాయిస్తోందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీవవైవిధ్య సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 34 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగు మనదేశంలో ఉన్నాయని చెప్పారు. ఈ నాలుగు హాట్‌స్పాట్స్‌లో 90 శాతం ప్రాంతం కోల్పోయినట్లుగా డేటా చెబుతోందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. ప్రపంచం మొత్తం మీద నమోదైన జీవరాశుల్లో 96 వేల జాతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపారు. 47 వేల వృక్షజాతులు, ప్రపంచంలోకెల్లా సగం నీటి మొక్కలతో భారత్ విలక్షణమైన జీవవైవిధ్యం కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా లంకమహేశ్వరం వన్యసంరక్షణ కేంద్రం, తిరుమల, సింహాచలం గిరులతోపాటు అనేక ప్రాంతాల్లో రోగచికిత్సకు వినియోగించే అరుదైన మొక్కలున్నా యని చెప్పారు.ఇలాంటి జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం తగినన్ని నిధులతో కార్యా చరణ చేపట్టాలని ఆయన కోరారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల తీవ్రత జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతున్న ందున ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ)లో భాగంగా దేశ అంతర్జాతీయ బాధ్యతల్లో సమన్వయం అవసరమని చెప్పారు. జీవవైవిధ్యం, ప్రయోజనాలు రక్షించడానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. బిల్లులో ప్రయోజనం – భాగస్వామ్య నిబంధనలు నిర్ణయించడంలో స్థానిక సంఘాల ప్రత్యక్ష పాత్రను తీసివేయడం సరికాదని చెప్పా రు. పరిహారం విషయాల్లో జరిమానా ఎలా అంచనా వేయాలనే దానిపై న్యాయనిర్ణయ అధికారికి మార్గద ర్శకత్వం లేకపోవడం సమస్యలకు తావిచ్చేలా ఉందన్నారు. న్యాయమూర్తులు, లేదా కోర్టులకు కాకుండా ప్రభుత్వ అధికారులకు ఆ తరహా అధికారం అవసర మా అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నందున బిల్లులో ఆ అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అటల్ జ్యోతి కింద ఏపీలో 5,500 సోలార్ వీధిలైట్లు అటల్ జ్యోతి యోజన ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్‌లో యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నాల్లో 5,500 సోలార్ వీధిలైట్లు అమర్చినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్‌లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5,500 సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా వాటిని అమర్చినట్లు తెలిపారు. -
జూన్ నుంచి ఈ–వే బిల్లింగ్
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ–వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ–వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ–వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అధికారులు సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులను జారీ చేసేవారు. జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఈ–వే బిల్లులను జనరేట్ చేస్తారు. రూ.50 వేలకు మించిన సరుకు రవాణాకు ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ–వే బిల్లును జనరేట్ చేసిన తర్వాత ఏకీకృత ఈ–వేబిల్లు నంబర్ ఇస్తారు. ఇది సప్లయర్, ట్రాన్స్పోర్టర్, సరుకు అందుకునే వారికి అందుబాటులో ఉంటుంది. -
ఇకపై ఎస్బీఐ లావాదేవీలపై చార్జీల మోతే
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమలు చేయనుంది. ఎటీంఎం, ఆన్లైన్ క్యాస్ ట్రాన్సాక్షన్లపై బాదుడు షురూ అయినట్టే. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో ఇకనుంచి నగదు ఉపసంహరణ, చెల్లింపులపై ఇక చార్జీల మోత మోగనుంది. ఇటీవల సవరించిన ఎస్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును వసూలు చేయనుంది. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో, మెట్రో నగరాల్లో 10 లావాదేవీలు ఉచితం. ఈ ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 వసూలు చేస్తుంది. దీంతోపాటు నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్, యూపీఐ, ఐయూఎస్ఎస్‌డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది. మరోవైపు చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది. -
ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధర పెంపు
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. సర్వీసు టాక్స్‌ను 0.5 శాతం మేర పెంచనున్నారు. అన్ని రకాల సరుకుల రవాణపై కూడా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఏసీ, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లపై సర్వీసు ఛార్జీలు ప్రస్తుతం 3.708 శాతం ఉండగా, 1వ తేదీ నుంచి 4.2 శాతం మేర వసూలు చేయనున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఉదాహరణకు 1000 రూపాయల ఏసీ టిక్కెట్టుపై అదనంగా 10 రూపాయలు ఛార్జీ వేయనున్నారు. కాగా ఇతర తరగతుల టిక్కెట్ల ధరలు యధాతథంగా ఉంటాయి. -
‘నైరుతి’ ఆలస్యం..!
భూమధ్య రేఖ దాటాక బలహీనపడ్డ రుతుపవనాలు జూన్ 1కి కేరళకు.. విస్తరణలోనూ జాప్యం సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ఈసారి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే అండమాన్‌లో ప్రవేశించడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 30 నాటికల్లా కేరళను తాకవచ్చని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భూమధ్య రేఖను దాటాక రుతుపవనాలు బలహీనపడటంతో ప్రస్తుతం నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి మూడు రోజులైనా పట్టవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీకల్లా తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. వడదెబ్బతో రాష్ట్రంలో 90 మంది మృతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. రామగుండంలో శుక్రవారం 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న మోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 45, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలలో 44, మహబూబ్‌నగర్‌లో 43.6, రంగారెడ్డిలో 43.1, హైదరాబాద్‌లో 43, మెదక్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో నాగర్‌కర్నూల్‌లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 90 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో 166 మంది.. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వడగాడ్పుల జోరు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 166 మంది మృత్యువాత పడ్డారు. -
జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం తె లిపింది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతుల కోసం తాత్కాలిక పంట బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలో మొత్తం 580 జిల్లాల్లో రైతులకు పంట బీమాను అందించాలని భావిస్తోంది. గత ఏడాది దేశంలో వర్షపాతం 12 శాతం తక్కువగా నమోదైంది. పంటలు దెబ్బతినడంతో చాలా మంది రైతులు దెబ్బతిని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున ధాన్యోత్పత్తికి లోటు రాకుండా కేంద్రం శ్రమిస్తోంది.