జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు | monsoon will enter in kerala by june 1 | Sakshi
Sakshi News home page

జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు

Published Mon, May 11 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు

జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు

న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు జూన్ 1న  కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం తె లిపింది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతుల కోసం తాత్కాలిక పంట బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.

ఈ పథకం కింద దేశంలో మొత్తం 580 జిల్లాల్లో రైతులకు పంట బీమాను అందించాలని భావిస్తోంది. గత ఏడాది దేశంలో వర్షపాతం 12 శాతం తక్కువగా నమోదైంది. పంటలు దెబ్బతినడంతో చాలా మంది రైతులు దెబ్బతిని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున ధాన్యోత్పత్తికి లోటు రాకుండా కేంద్రం శ్రమిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement