ఢిల్లీ: సహచర కేంద్రమంత్రులు, బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యల పట్ల హోం మంత్రి రాజనాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, నాయకులు మరింత జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు తమ ఉద్దేశాలను ప్రజలముందు ఉంచే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాట్లాడిన తరువాత.. వక్రికరించారంటూ తప్పించుకోవడం కుదరదన్నారు.
ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ ఫరీదాబాద్ ఘటనపై మాట్లాడుతూ.. ఎవరో కుక్కపై రాయి విసిరితే కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. అలాగే మరో మంత్రి రిజిజ్.. ఉత్తర భారతీయులు నిబంధనలను అతిక్రమించడం గర్వంగా భావిస్తారన్న మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఏకీభవిస్తున్నాన్న వ్యాఖ్యలను రాజనాథ్ సింగ్ తప్పుపట్టారు. ఈ రెండు ఘటనలలో మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.