న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. అలాగే అమర్నాథ్ యాత్రికుల తరలింపుపై ఏర్పాట్లుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని, ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయాలని ఆమె సూచించారు. సామాన్య పౌరుల మరణాలు, భద్రతా బలగాలపై దాడులు బాధాకరమని ఆమె అన్నారు.