రంజన్ గొగోయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును ప్రస్తుత సీజే దీపక్ మిశ్రా ప్రాతిపాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 3న 46వ ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ ప్రమాణం చేయనున్నారు. దీంతో రంజన్ గొగోయ్ దేశ చరిత్రలో ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. 1954 నవంబర్ 18న ఈశాన్యంలోని ఆసోంలో జన్మించిన గొగోయ్.. 1978లో బార్‌కౌన్సిల్‌ల్లో పేరును నమోదు చేసుకున్నారు.
ఈ తరువాత గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ మోదలుపెట్టి, 2010లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. 2012లో ప్రమోషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. ప్రభుత్వ పథకాల ప్రకటనలో రాజకీయ నాయకుల ఫోటోలను వాడకూడదని, కేవలం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోటోలను మాత్రమే ముద్రించాలని 2015లో కీలక తీర్పును ఇచ్చారు. ఇటీవల న్యాయ చరిత్రలో సంచలనం సృష్టించిన నలుగురు న్యాయమూర్తుల తిరుగుబాటులో రంజన్ గొగోయ్ ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment