
'శర్మ చర్య సమర్థనీయం కాదు'
న్యూఢిల్లీ: పటియాలా కోర్టు ఆవరణలో తమ పార్టీ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ శర్మ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. హింసాత్మక చర్యలకు ఎవరూ పాల్పడినా తప్పేనని చెప్పారు. ఇటువంటి చర్యలను బీజేపీ ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు. క్యాంపస్ లో జాతివ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు.
రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కేసు విచారణ సందర్భంగా పటిపాలా కోర్టు ఆవరణలో జరిగిన ఘర్షణలో శర్మ వామపక్ష కార్యకర్తలపై దాడి చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. తన చర్యను శర్మ సమర్థించుకున్నారు. సమయానికి చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిననంటూ రెచ్చిపోయారు.