అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు | rehan, son of priyanka makes surprise visit to amethi | Sakshi
Sakshi News home page

అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు

Published Sat, Jul 11 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు

అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనవడు, ప్రియాంక - రాబర్ట్ వాద్రాల కొడుకు రేహన్ అమేథీలో పర్యటించాడు. ఒక రాత్రి అక్కడే ఉన్నాడు. 14 ఏళ్ల రేహన్ ఎవరికీ ముందుగా చెప్పకుండా.. తన స్నేహితులతో కలిసి కారులో అక్కడకు వెళ్లాడు. ఒక గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలేంటని గ్రామస్థులను అడగడంతో పాటు.. వాళ్లతో కలిసి భోజనం చేశాడు. తర్వాత మున్షీగంజ్ లోని సంజయ్ గాంధీ ఆస్పత్రి గెస్ట్హౌస్కు వెళ్లి అక్కడ ప్రజలను కలిశాడు.

రేహన్ వస్తున్నట్లు ముందుగా ఎవరికీ తెలియకపోవడంతో.. గ్రామస్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అమేథీ నియోజకవర్గానికి ప్రస్తుతం రేహన్ మేనమామ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోనియా, ప్రియాంక కూడా ఇక్కడ తరచు పర్యటిస్తుంటారు. అమేథీ, రాయ్బరేలి రెండూ ఎప్పటినుంచో కాంగ్రెస్ కంచుకోటలు.

Advertisement

పోల్

Advertisement