న్యూఢిల్లీ: దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని పోత్సహించడానికి ఎరువుల సబ్సిడీలకు బదులు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్రతిపాదించారు. దేశంలో తొలి ఆర్గానిక్ రాష్ట్రం సిక్కిం అని 2016లో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిక్కిం ప్రజలు వదులుకున్న ఎరువుల సబ్సిడీలకి రెండు రెట్ల మొత్తాన్ని నగదుగా ఇవ్వాలని కోరితే ప్రధాని స్పందించలేదని అని చామ్లింగ్ గుర్తు చేశారు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి బిహార్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం సాయం కోరుతున్నాయని తెలిపారు. సేంద్రీయ విధానానికి మారకుంటే మన భవిష్యత్ సురక్షితం కాదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment