
సాక్షి, న్యూఢిల్లీ : భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక డూడుల్‌ను సింగపూర్‌కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దారు.అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, తాజ్‌మహల్,ఇండియా గేట్, కూడా ప్రతిబింబించేలా తయారు చేశారు. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment