న్యూఢిల్లీ: ఒక రోడ్డు ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలో పోలీసులు, సామాన్యులకు మధ్య ఘర్షణకు తావిచ్చింది. నిరసనకారులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరపగా ఒక ఆందోళన కారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ శివారులోని హోలాంబి కలాన్ లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు మూడేళ్ల పసిపాపను ఢీకొట్టి ఆ పాప ప్రాణాలుపోయేందుకు కారణమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ సంఖ్యలో అక్కడికి నిరసనలు తెలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోగా తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో తొలుత భాష్పవాయుగోళాలు ప్రయోగించిన పోలీసులు అనంతరం ఫైరింగ్ చేశారు. దీంతో ఆందోళనకారుల్లో ఒకరు మృతిచెందాడు.
ఢిల్లీ శివారులో ఉద్రిక్తత
Published Thu, Dec 24 2015 4:47 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement