సోనియా, ఏచూరిలతో రోహిత్ తల్లి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు రాజాలు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ ఎంపీ కేసీ త్యాగిని శనివారం ఢిల్లీలో కలిశారు. విద్యాసంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టం తీసుకొచ్చేందకు కృషిచేయాలన్నారు. తమ ఉద్యమానికి కాంగ్రెస్ అందించిన సహకారానికి సోనియాకు రాధిక కృతజ్ఞతలు తెలిపారు. చట్టం ఏర్పాటుపై సోనియా సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు.
రోహిత్ తల్లి ఆవేదనను వినండి: రాహుల్
మంత్రి సృ్మతి ఇరానీ లోక్‌సభలో ఎంతో అద్భుతంగా ప్రసంగించారని తన ట్విటర్‌లో ప్రశంసించిన ప్రధాన మంత్రి మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. స్మృతి ఇరానీ పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రధాని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదనను కూడా ఒకసారి వినాలని ట్వీట్ చేశారు.