విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు | Royal Bhutan aircraft catches fire at Kolkata airport | Sakshi
Sakshi News home page

విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు

Published Sat, Sep 9 2017 8:09 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు - Sakshi

విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు

సాక్షి, కోల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం నుంచి పొగలు రావడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆ వివరాలిలా.. కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్ నుంచి రాయల్ భూటాన్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్‌కు బయలుదేరింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో రన్‌వేపైనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు.

వెంటనే ప్రయాణికులను విమానం నుంచి క్షేమంగా కిందకి దించేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎయిర్‌లైన్స్ వద్దకు చేరుకుని మంటలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనిపై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అటల్ దీక్షిత్ మాట్లాడుతూ.. విమానంలో మొత్తం 80 మంది ఉన్నారు. టేకాఫ్ అవుతుంటే దట్టమైన పొగలు రావడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించాడు. గాయాలైన కొందరికి చికిత్స అందించాం. ఇతర విమానాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని' వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement