ఎన్నికలకు ముందు చిక్కుల్లో డీఎంకే! | Rs 2 crore seized from DMK candidate, son house | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ముందు చిక్కుల్లో డీఎంకే!

Published Wed, May 11 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

ఎన్నికలకు ముందు చిక్కుల్లో డీఎంకే!

ఎన్నికలకు ముందు చిక్కుల్లో డీఎంకే!

  • ఆ పార్టీ అభ్యర్థి వద్ద రెండుకోట్ల సీజ్‌!

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ప్రతిపక్ష డీఎంకే పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ అభ్యర్థి వద్ద, అతని కొడుకు వద్ద ఏకంగా రూ. 2 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    అరవకురిచి నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కేసీ పళనిచామీ, అతని కేసీపీ శివరామన్‌ ఇళ్లు, కార్యాలయాలపై పక్కా సమాచారంతో ఆదాయం పన్ను అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ముందుస్తు సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో రూ. 2 కోట్లు లభించాయని, దీంతో ఈ డబ్బు ఎక్కడిది? ఎన్నికల్లో పంచడానికి ఉపయోగిస్తున్నారా? అన్నదానిపై విచారణ జరుపుతున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు.

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐటీ, ఎన్నికల అధికారులు దాడులు ముమ్మరం చేశారు. తమిళనాడులో మంగళవారం వేర్వేరు చోట్ల జరిపిన ఈ దాడుల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు రూ.4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement