న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధి నుంచి తప్పించే ప్రతిపాదనకు సంబంధించిన ‘రహస్య’ కేబినెట్ నోట్‌ను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది. ఇలాంటి నోట్‌ను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు ప్రజా సంస్థలని, వాటిని ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) జూన్ 3న ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం జూలై 13న ఈ నోట్‌ను రూపొందించింది. దీన్ని తాజాగా సిబ్బంది మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరచింది