చిదంబరం భార్యను విచారించిన సీబీఐ!
న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినీ చిదంబరాన్ని సీబీఐ శనివారం చెన్నైలో విచారించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆమెకు శారదా గ్రూప్ చెల్లించిన లీగల్ ఫీజు విషయమై సీబీఐ ఆరా తీసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శారదా గ్రూప్ తరఫు లాయర్‌గా ఆమెకు కోటి రూపాయల లీగల్ ఫీజు చెల్లించినట్లు గ్రూప్ చైర్మన్ సుదీప్త సేన్ గతంలో సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ టీవీ చానల్‌ను సొంతం చేసుకునే ప్రణాళికల్లో భాగంగా తగిన సలహా ఇవ్వడానికి ఆమెను శారదా గ్రూప్ నియమించుకుంది.