సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ, జాతీయ రాజధాని(ఎన్‌సీఆర్) ప్రాంతంలో క్రాకర్స్‌పై విధించిన నిషేధం సవరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ అంశానికి మతం రంగు పులమరాదని, రాజకీయం చేయొద్దని స్పష్టం చేసింది. తమ తీర్పుపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దీన్ని రాజకీయం చేయొద్దని, మతం కోణం చొప్పించరాదని శుక్రవారం సుప్రీం కోర్టు కోరింది. ఢిల్లీ,ఎన్‌సీఆర్ పరిధిలో దివాళీ సందర్భంగా క్రాకర్స్ అమ్మకాలపై నిషేధ ఉత్తర్వులను అమలు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
పటాసుల అమ్మకంపై నిషేధ ఉత్తర్వులు వెలువడక ముందు కొనుగోలు చేసిన క్రాకర్స్‌ను ప్రజలు కాల్చుకోవచ్చని పేర్కొంది. పటాసుల అమ్మకంపై నిషేధాన్ని సడలించాలని కోరుతూ తాత్కాలిక లైసెన్సులు కలిగిన బాణాసంచా విక్రయదారులు బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2016లో విధించిన క్రాకర్స్‌పై నిషేధాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఎత్తివేయడంతో రిటైలర్లు బాణాసంచాను కొనుగోలు చేశారని, అయితే ఇటీవల పటాసుల విక్రయాలపై నిషేధం విధించడంతో వారంతా నష్టపోతారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment