సాక్షి, న్యూఢిల్లీ : ఈ పండక్కి పటాకులు అమ్మటానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. విక్రయదారులకు ఢిల్లీ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో బాణాసంచాల క్రయవిక్రయాలను నిషేధిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు.
ఢిల్లీ, రాజధాని చుట్టుపక్కల ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో నవంబర్ 1 వరకు పటాకుల విక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు ఆన్ లైన్ విక్రయాలకు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని మధుర్ వర్మ అనే అధికారి మీడియాకు తెలిపారు. ఇక ప్రతీ యేటా బాణాసంచాల విక్రయానికి పోలీస్ శాఖ జారీ చేసే తాత్కాలిక లైసెన్సులను సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ యేడాది ఇవ్వలేదని ఆయన చెప్పారు.
ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోగా.. దీపావళికి మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ అర్జున్ గోపాల్ అనే ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కాలుష్య నియంత్రణ మండలి కూడా మద్ధతు తెలపటంతో పటాకుల అమ్మకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment