జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ ఎన్నికల షెడ్యూలు విడుదల
జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ షెడ్యూలు విడుదల చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు నవంబర్ 25వ తేదీ నుంచి మొదలవుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల డిసెంబర్ 23న ఉంటాయి.
వీటితో పాటు ఢిల్లీ అసెంబ్లీలోని మెహరోలి, తుగ్లకాబాద్, కృష్ణానగర్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవి జమ్ము కాశ్మీర్ తొలిదశతో పాటు జరుగుతాయి. రెండు రాష్ట్రాల్లోను నోటాకు కూడా అవకాశం ఉంటుంది. జమ్ము కాశ్మీర్లో మొత్తం 10,050 పోలింగ్ కేంద్రాలుంటాయి. జార్ఖండ్ లో మొత్తం 24,648 పోలింగ్ కేంద్రాలుంటాయి.
ముఖ్యమైన తేదీలివీ...
రెండు రాష్ట్రాలకు తొలిదశ ఎన్నికలు - నవంబర్ 25
రెండు రాష్ట్రాలకు రెండోదశ ఎన్నికలు - డిసెంబర్ 2
రెండు రాష్ట్రాలకు మూడోదశ ఎన్నికలు - డిసెంబర్ 9
రెండు రాష్ట్రాలకు నాలుగోదశ ఎన్నికలు - డిసెంబర్ 14
రెండు రాష్ట్రాలకు ఐదోదశ ఎన్నికలు - డిసెంబర్ 20
రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 23