సాక్షి, కోల్‌కతా : బ్యూరోక్రసీలో లైంగిక వివక్షపై మహిళా ఐపీఎస్ అధికారిణి రూప ముడ్గిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత అధికార యంత్రాంగంలో దాచాలని ప్రయత్నించినా లైంగిక వివక్ష పలు రూపాల్లో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో రూప జైళ్ల డీఐజీగా పనిచేసే క్రమంలో బహిష్కృత ఏఐఏడీఎంకే నేత శశికళకు బెంగళూర్ జైలులో స్పెషల్ ట్రీట్‌మెంట్ లభిస్తోందని వెలుగులోకి తేవడం ద్వారా ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. భారత బ్యూరోక్రసీలో లైంగిక వివక్ష పైకి కనిపించకపోయినా పలు రూపాల్లో కొనసాగుతున్నదని చెప్పారు.
పలు ప్రతిష్టాత్మక పోస్టుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే అధికంగా ఉన్నారని ఈ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. సామర్థ్యంలో ఎలాంటి తేడా లేకున్నా పురుషులే పలు కీలక పదవుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కొన్ని కీలక పదవుల్లో మహిళలను నియమించినా లేడీ ఆఫీసర్ల పోస్టింగ్‌పై ఆమె ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవచ్చా లేదా అని అధికారంలో ఉన్నవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల తన సర్వీసులో 26 సార్లు బదిలీలకు గురికావడం తనను కొంత నిరుత్సాహానికి గురిచేసినా సమాజానికి మంచి చేసేందుకు తనకు ఇవి అవరోధం కాదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment