
ఢిల్లీ/లండన్ : మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నగరాల జాబితాలో ప్రపంచంలో ఢిల్లీనే మొదటి నగరంగా నిలిచింది. లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.
ఢిల్లీలోని మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని, ఆ నగరం భారత దేశ లైంగిక దాడుల కేంద్రంగా ఉందని కూడా ఆ సర్వే తెలిపింది. ప్రపంచంలోని మొత్తం 19 మహానగరాల్లో ఈ సంస్థ ఈ ఏడాది(2017) జూన్ నుంచి జూలై నెలల మధ్య సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. నిర్భయ ఘటన చోటు చేసుకొని ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగవకుండా మరింత దిగజారినట్లుగా నివేదిక రావడం గమనార్హం. మరోపక్క, ఢిల్లీతోపాటు బ్రెజిల్‌కు చెందిన సావ్ పౌలో నగరం కూడా ఈ వరుసలో నిల్చొంది.
Comments
Please login to add a commentAdd a comment