కేరళలోని కొల్లాం జిల్లా కడక్కల్‌లో 90 ఏళ్ల బామ్మపై 63 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తిరువనంతపురం/కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లా కడక్కల్‌లో 90 ఏళ్ల బామ్మపై 63 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వితంతువైన ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. కడక్కల్‌లో ఒంటరిగా జీవిస్తోంది.
నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. వైద్యపరీక్షల నిమిత్తం బామ్మను ఆస్పత్రిలో చేర్పించారు.