న్యూఢిల్లీ: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. ఏడాదికోసారి జరిగే గిల్డ్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ ఏకే భట్టాచార్య ప్రధాన కార్యదర్శిగా, టీవీ చానెల్ న్యూస్‌ఎక్స్ ఎడిటర్(న్యూస్ ఎఫైర్స్) షీలా భట్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. శేఖర్‌గుప్తా బిజినెస్ స్టాండర్డ్‌లో ‘నేషనల్ ఇంట్రెస్ట్’ కాలమిస్ట్‌గా, ‘దిప్రింట్’ న్యూస్ పోర్టల్‌కు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment