లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంపై తమ హక్కును పూర్తిగా వదులుకోవడానికి సిద్ధమనీ, అందుకు ప్రతిగా లక్నోలో మసీదు నిర్మించాలని ఆ రాష్ట్ర షియా వక్ఫ్‌బోర్డు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని గత శనివారమే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి ఇదే అత్యుత్తమ మార్గమనీ, లక్నోలోని హుసేనాబాద్‌లో ఎకరా స్థలంలో రాష్ట్రప్రభుత్వం మసీదును నిర్మించాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనను సున్నీ వక్ఫ్‌బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. హక్కును వదులుకుంటామని షియా వక్ఫ్‌బోర్డు చెబుతోందనీ, బాబ్రీ మసీదు స్థలంపై దానికి అసలు హక్కు ఎక్కడుందని సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment