ఇక షిర్డీకి విమాన రాకపోకలు
Published Thu, Sep 21 2017 6:46 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM
సాక్షి,న్యూఢిల్లీః షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులు ఇక నేరుగా విమానాల్లో షిర్డీ చేరుకోవచ్చు. షిర్డీ విమానాశ్రయానికి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గురువారం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
షిర్డీ ఎయిర్‌పోర్ట్‌లో ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలకు వీలు కల్పించేలా అత్యంత పొడవైన రన్‌వేను నిర్మించారు. విమానాశ్రయంలో అన్ని ప్రమాణాలు, వసతులను పరిశీలించిన అనంతరం షిర్డీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల వినియోగానికి అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను జారీ చేశామని డీజీసీఏ సీనియర్ అధికారి వెల్లడించారు.
Advertisement