
సాక్షి, న్యూఢిల్లీ : అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్ధుబాటును బీజేపీ-శివసేన కూటమి ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనుంది. సీట్ల సర్ధుబాటు ఒప్పందంపై తుది చర్చలు బీజేపీ అగ్ర నేత అమిత్ షా సమక్షంలో జరిగాయని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను శివసేన 128 స్ధానాల్లో, బీజేపీ 160 స్ధానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. కూటమిలోని ఇతర చిన్నాచితక పార్టీలకు 15 నుంచి 18 స్ధానాలను కట్టబెడతారని భావిస్తున్నారు.
మరోవైపు హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఆదివారం జరగనుంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రకటించింది. 288 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ఇరు పార్టీలు చెరి 125 స్ధానాల్లో బరిలోకి దిగుతామని వెల్లడించాయి. మిగిలిన స్ధానాల్లో కూటమిలోని ఇతర చిన్న పార్టీలు పోటీ చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment