uddhav thakre
-
Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా. తొలి కేసు ఇందిరదే పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్ (ఐ)కి హస్తం గుర్తు లభించింది. తాజా వివాదాలు... గత అక్టోబర్‌లో బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి (రామ్‌విలాస్ పాశ్వాన్) పేరుతో, హెలికాప్టర్ గుర్తుతో; పరాస్ వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పేరుతో, కుట్టు మిషన్‌తో పోటీ చేశాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తు ఆయనకే దక్కింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
ఉద్ధవ్ ఠాక్రేపై భగ్గుమన్న బాలీవుడ్ క్వీన్
ముంబై : మహారాష్ట్రలో పాలక శివసేనతో తలపడిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం మరోసారి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్‌పై విరుచుకుపడ్డారు. హరియాణాకు చెందిన యూట్యూబర్ సాహిల్ చౌదరి అరెస్ట్ వ్యవహారంలో ఆమె మహారాష్ట్ర సర్కార్‌ను తప్పుపట్టారు. ముంబైలో గూండా రాజ్యం సాగుతోందని..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రపంచంలోనే అత్యంత అసమర్థ సీఎం అని మండిపడ్డారు. సాహిల్ చౌదరి అరెస్ట్ వార్తాంశాన్ని షేర్ చేస్తూ కంగనా ట్వీట్ చేశారు. అసమర్ధ సీఎంను ఆయన బృందాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదా అని నిలదీశారు. అసలు వారు మనకేం చేశారు..? మన ఇళ్లను పగలకొట్టి మనల్ని చంపడమేనా..? దీనికి ఎవరు బదులిస్తారని కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. సర్కార్‌ను ప్రశ్నించడం సాహిల్ చౌదరి ప్రజాస్వామిక హక్కని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సాహిల్‌పై ఎవరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాని ఆధారంగా ఆయనను తక్షణమే జైలుకు పంపారని, మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఇదేం చోద్యమంటూ ఆమె ప్రశ్నించారు. చదవండి : ఇప్పుడు మీ నోళ్లు మూసుకుపోయాయా : శివసేన -
కంగనా వివాదం : పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై : కంగనా రనౌత్ వ్యవహారం ముగిసిపోయిన అథ్యాయమని వివాదానికి ఆద్యుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించినా ఈ అంశం సెగలు పుట్టిస్తూనే ఉంది. కంగనాపై వచ్చిన డ్రగ్ ఆరోపణలపై నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. మరోవైపు కంగనా వ్యవహారం ఆమెకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న వార్ కాబోదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం స్పష్టం చేశారు. కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు వారి నిబంధనల ప్రకారం కూల్చివేశారని, ఇది కార్పొరేషన్ నిర్ణయమని బీఎంసీ చెబుతోందని అన్నారు. దీనిపై సోనియా గాంధీ గురించి కంగనా ట్వీట్ చేస్తే తానేం చెప్పగలనని పవార్ ప్రశ్నించారు. ఇక కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసేముందు బీఎంసీ అధికారులు ఆమెకు మరింత సమయం ఇచ్చిఉండాల్సిందని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్ వ్యాఖ్యానించారు. గతంలో కంగనా హృతిక్ రోషన్‌పై పలు వ్యాఖ్యలు చేసినా ఆయన మౌనం దాల్చడంతో ఆ వ్యవహారం సమసిపోయిందని, బీఎంసీ కూడా హృతిక్‌ను చూసి నేర్చుకోవాల్సిందని అన్నారు. గతంలో హృతిక్‌పై కంగనా ఆరోపణలు గుప్పించినా కొద్దిరోజులు ఆయన మౌనంగా ఉండటంతో ఆ అంశం కనుమరుగైందని, మనం కూడా మౌనంగా ఉంటే ఈ అంశం కూడా సమసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మహిళను అవమానించారని ఆరోపిస్తూ కంగనాపై వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై కర్ణిసేన, యూపీ మహిళా శక్తి రాష్ట్ర అధ్యక్షురాలు శ్వేతా రాజ్ సింగ్ ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసులపై తనకు విశ్వాసం లేదని కంగనా చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో శివసేన, బాలీవుడ్ క్వీన్ల మధ్య వివాదానికి తెరలేచింది. చదవండి : బాలీవుడ్ క్వీన్‌కు మరో షాక్ -
భద్రత లేకుంటే నా బిడ్డకు ఏం జరిగేదో!
ముంబై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తల్లి ఆశా రనౌత్ తప్పుపట్టారు. తమ కుమార్తె పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. యావత్ దేశం తమ కుమార్తె వెంట ఉందని, ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని చెప్పారు. సత్యం వెంట నిలిచే తన కుమార్తెను చూసి గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. కంగనాకు భద్రత కల్పించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కంగనాకు భద్రత కల్పించకపోతే ఆమెకు ఏం జరిగేదో ఎవరూ ఊహించలేరని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై ముంబై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి ముంబై పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదన్న బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలో ఉండరాదని కంగనాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చెలరేగింది. బుధవారం ముంబైలో కంగనా అడుగుపెట్టిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అక్రమ కట్టడం అంటూ కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చడం కలకలం రేపింది. దీనిపై కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతపై కోర్టు స్టే విధించింది. చదవండి : ఠాక్రేపై వ్యాఖ్యలు : కంగనాపై పోలీసులకు ఫిర్యాదు -
ఠాక్రేపై వ్యాఖ్యలు : కంగనాపై పోలీసులకు ఫిర్యాదు
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై ముంబై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. ఈనెల 9న సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన ఓ వీడియోలో ముఖ్యమంత్రి ఠాక్రేను ఉద్దేశించి ఆయన ప్రతిష్టను దెబ్బతీసే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ ఫిర్యాదు అందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడంతో పాటు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని ఓ ఫిర్యాదిదారు పేర్కొన్నారు. ముంబైలోని తన కార్యాలయాన్ని బీఎంసీ కూలదోయడంపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనా సీఎం ఠాక్రేపై ధ్వజమెత్తుతూ బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఆమె ముఖ్యమంత్రిని ఉద్దేశించి..‘ఉద్ధవ్ ఠాక్రే..మీరు ఏమనుకుంటున్నారు? ఫిల్డ్ మాఫియాతో కుమ్మక్కై మీరు నా ఇంటిని కూల్చివేసి నాపై పగతీర్చుకున్నారా..? ఈరోజు నా ఇంటిని కూల్చారు..రేపు మీ అహంకారం కూలుతుంద’ని కంగనా పేర్కొన్నారు. కాగా కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదన్న బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలో ఉండరాదని కంగనాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చెలరేగింది. చదవండి : ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా! -
పవార్, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బెదిరింపు కాల్స్ వచ్చిన మరుసటి రోజే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు సోమవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇద్దరు నేతల నివాసానికి బెదిరింపు కాల్స్ వచ్చాయని, పవార్, దేశ్‌ముఖ్‌లకు దేశం వెలుపల నుంచి ఈ కాల్స్ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం బాంద్రాలోని మాతోశ్రీని పేల్చేస్తామని శనివారం బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తరపున తాను కాల్ చేస్తున్నానని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్టు అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగంతకుడు రెండు సార్లు కాల్ చేశాడని, దీంతో ఠాక్రే బంగళా వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చదవండి : శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా -
‘మాతోశ్రీని పేల్చేస్తాం’
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని ఠాక్రేకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. చదవండి : ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కంగనా -
భూమి పూజ : ఉద్ధవ్ ఠాక్రేకు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : అధికారం కోసం హిందుత్వను విడిచిపెట్టారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ విమర్శల దాడి చేయగా, అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే రామమందిర భూమిపూజకు శివసేన అధిపతిని ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మంగళవారం స్పష్టం చేసింది. భూమిపూజకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఆహ్వానించలేదని, ప్రోటోకాల్‌ను అనుసరించి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. రామమందిర ఉద్యమంతో శివసేన ఎన్నడూ మమేకం కాలేదని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా వ్యవహరిస్తున్నందున శివసేన చీఫ్ హోదాలోనూ ఆయనను ఆహ్వానించలేదని చెప్పారు. చదవండి : వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్.. ఏ రాష్ట్ర సీఎంనూ ఈ కార్యక్రమానికి పిలవడంలేదని వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ-భూమిపూజ చేపట్టాలని ఠాక్రే గతంలో సూచించారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనపై అలోక్ కుమార్ స్పందిస్తూ గతంలో హిందుత్వ పార్టీ అయిన శివసేన దిగజారుడుతనం బాధాకరమని అన్నారు. హోంమంత్రిత్వ శాఖ పొందుపరిచిన కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కొద్దిమందితోనే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే రామమందిర శంకుస్ధాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కొద్దిమందినే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర పేర్కొంది. -
స్టీరింగ్ వ్యాఖ్యలపై ఠాక్రేకు ట్రోలింగ్
ముంబై : శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సర్కార్‌ను మూడు చక్రాల బండితో పోలుస్తూ స్టీరింగ్ తన చేతిలో ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సంకీర్ణ సర్కార్‌లోనే కలకలం రేగిందనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఠాక్రేకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే దీటుగా కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో వాహనంలో ఆయన పక్కనే తాను కూర్చున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఠాక్రేకు అజిత్ పవార్ బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే ఈ ఫోటోలో వాహనం స్టీరింగ్ అజిత్ పవార్ చేతిలో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి, మహా వికాస్ అఘది నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవార్ తన పోస్ట్‌ను ముగించారు. ముఖ్యమంత్రి స్టీరింగ్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ అజిత్ పవార్ చేసిన పోస్ట్‌కు పలువురు స్పందించారు. సీఎంను అభినందిస్తూ స్టీరింగ్ మీ చేతిలో ఉన్న ఫోటోను ఎందుకు వాడారు దాదాజీ అంటూ ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆయయనను ప్రశ్నించారు. కాగా తన సర్కార్‌ను విపక్షాలు కూల్చలేవని..తన ప్రభుత్వ భవితవ్యం వారి చేతిలో లేదని ఠాక్రే వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం ఆటోరిక్షా(త్రిచక్రవాహనం) వంటిదని, దాని స్టీరింగ్ తన చేతిలో ఉందని, వెనుక సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయని ఠాక్రే పేర్కొన్నారు. దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీకి ఠాక్రే సవాల్ విసిరారు. ఉద్ధవ్ ఠాక్రే సోమవారం 60వ ఏట అడుగుపెట్టారు. అయితే ఠాక్రే వ్యాఖ్యల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ -
బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విపక్ష బీజేపీకి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ భవితవ్యం విపక్షం చేతిలో లేదని ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారో చూస్తానని ఠాక్రే కాషాయపార్టీని హెచ్చరించారు. ఒకట్రెండు నెలల్లో తన ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారని, వారిని తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆటో రిక్షా మాదిరిగా మూడు చక్రాలతో సాగుతోందని, పేద ప్రజల కోసం స్టీరింగ్ తన చేతిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరో ఇద్దరు (కాంగ్రెస్, ఎన్సీపీ) వెనుకనుంచి తమకు మద్దతుగా కూర్చున్నారని అన్నారు. మరి కేంద్రంలో ఎన్డీయే పరిస్థితి ఏంటి? వారికి ఎన్ని చక్రాలున్నాయని ప్రశ్నించారు. గతంలో తాను ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు వారికి రైలు తరహాలో 30-35 చక్రాలున్నాయ’ని (పార్టీలు) ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇక చైనాతో సరిహద్దు వివాదాన్ని ఠాక్రే ప్రస్తావిస్తూ ఈ అంశంపై దేశానికి ఓ విధానాన్ని నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించానిని అన్నారు. 20 మంది అమర జవాన్ల త్యాగానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. కానీ మనం చైనా యాప్‌లను నిషేధించి సంబరపడ్డామని మోదీ సర్కార్‌కు చురకలు వేశారు. చదవండి : అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్ ఠాక్రే సెటైర్లు భూమిపూజకు హాజరవుతా! అయోధ్యలో ఆగస్ట్ 5న రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజకు తాను హాజరవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో జరిగే ప్రార్ధనల్లో తాను పాల్గొంటానని ఆయన శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారించారు. ‘నేను అయోధ్యకు వెళతా..భూమి పూజలో పాల్గొంటా..ముఖ్యమంత్రి కాకముందూ మందిర నిర్మాణం పట్ల విశ్వాసం ఉందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అయోధ్యకు వెళ్లి ప్రార్ధనల్లో పాల్గొంటా’నని చెప్పారు. -
గుడ్‌న్యూస్ : ఆ రెండు ఔషధాలు ఉచితం
ముంబై : కరోనా వైరస్ చికిత్సలో వాడుతున్న రెమ్డిసివిర్, ఫవిపిరవిర్ ఔషధాలను ఉచితంగా రోగులకు అందించాలని యోచిస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచామని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ‘ఛేజ్ ద వైరస్’ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. డెక్సామెథాసోన్ మందును ఇప్పటికే తమ వైద్యులు వాడుతున్నారని, ప్లాస్మా థెరఫీ కూడా మెరుగైన ఫలితాలు అందిస్తోందని అన్నారు. కరోనా చికిత్సలో తాము సోమవారం నుంచి ప్లాస్మా థెరఫీ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు. జూన్ 31 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న క్రమంలో మరో 3 నెలలు పీఎం గరీబ్ కళ్యాణ్ పథకాన్ని పొడిగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఇంతటి సంక్షోభ సమయంలోనూ 16,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై సంతకం చేశామని, ఇది మహారాష్ట్ర పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి నిదర్శనమి చెప్పారు. -
మహా సర్కార్‌లో విభేదాలు నిజమే
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మంత్రి అశోక్ చవాన్ అంగీకరించారు. విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని కాంగ్రెస్ కోరుతోందని చెప్పారు. మరో రెండు రోజుల్లో సీఎం కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహావికాస్ అగడి భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలున్నాయని, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తాము సీఎంతో రెండు రోజుల్లో భేటీ అవుతామని అశోక్ చవాన్ చెప్పారు. కీలక సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు ఆహ్వానం అందడం లేదని కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి సహా పలు అంశాలపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే పలుమార్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమవుతుండగా ఈ భేటీలకు కాంగ్రెస్ నేతలను పిలవకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంతో పాటు గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేషన్లు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్‌లు సోమవారం ఉద్ధవ్ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. చదవండి : మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర -
‘ఇలాగైతే మళ్లీ లాక్డౌన్’
ముంబై : కోవిడ్-19 నియంత్రణలను ప్రజలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. కరోనా మహమ్మారిపై క్షేత్రస్ధాయి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని, సడలింపులు ముప్పుగా మారాయని వెల్లడైతే మరోసారి లాక్డౌన్ తప్పదని స్పష్టం చేశారు.లాక్డౌన్ సడలింపులతో మహమ్మారి ముప్పు తీవ్రతరమైందని వెల్లడైతే లాక్‌డౌన్‌ను తిరిగి విధించేందుకు వెనుకాడబోమని, ప్రజలు దయచేసి ఒకచోట గుమికూడరాదని ఠాక్రే ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో దశలవారీగా లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని, అయితే ప్రమాదం ఇంకా ముంగిటే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయలేమని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనం కోసమే తాము పనిచేస్తున్నామని మహారాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నందునే వారు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041కు పెరగ్గా 3438 మంది మరణించారు. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకూ 44,517 మంది కోలుకున్నారు. చదవండి : వధువు తండ్రి, చెల్లికి వైరస్.. పెళ్లికి బ్రేక్ -
సీఎం ఇంటి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట ఉన్న భద్రతా సిబ్బందిలోని ముగ్గురు పోలీసులకు శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ముగ్గురు పోలీసులు సీఎం నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని తెలుస్తోంది. సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం ఇంటి వద్ద ఉన్న పోలీసులను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న భద్రతా సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నారు. (కరోనా : నాందేడ్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్) ఇక మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 485 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 37,776కి చేరగా 1218 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. (కాంక్రీట్ మిక్సింగ్ ట్రక్కులో 18 మంది) కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం -
మన్ కీ బాత్‌పై ఉద్ధవ్ సెటైర్లు
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఏఆర్ అంతూలేపై పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం మన్ కీ బాత్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. అంతూలే శివసేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రేకు అత్యంత సన్నిహితులని, ఈ పుస్తకం దిల్ కీ బాత్ వంటిదని, ఇది మన్ కీ బాత్కు భిన్నమైనదని ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ఉటంకిస్తూ చురకలు వేశారు. అంతూలే అద్భుత పరిపానా దక్షుడని, తన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్పనేతని కొనియాడారు. అంతూలే సాహెబ్ ప్రతిరోజూ తన భార్యకు ఈ లేఖలు రాయగా ఆమె వాటిని భద్రంగా దాచారని ఇది వారి మధ్య నెలకొన్న గొప్ప బంధానికి సంకేతమని ఠాక్రే అన్నారు. అంతూలే కేంద్ర మంత్రి అయిన సందర్భంలో తాను ఢిల్లీలో శివసేనకు బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పడం తనకు గుర్తుందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన బతికిఉంటే తన స్నేహితుడి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యేవారని అన్నారు. తన తండ్రి స్నేహితులందరూ తనను ఇష్టపడతారని శరద్ పవార్ వైపు చూస్తూ ఠాక్రే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌లు పాల్గొన్నారు. చదవండి : ‘అది మరో జలియన్ వాలాబాగ్’ -
జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
-
జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్ధులపై ఆదివారం రాత్రి సాగిన ముసుగు దుండగుల దాడిని ముంబై పేలుళ్ల దాడితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పోల్చారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లతో విద్యార్ధులు, టీచర్లపై విరుచుకుపడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. విద్యార్ధులపై దాడులను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని ఈ ఘటనకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన విద్యార్దులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సత్వరమే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. జామియా మిలియా విద్యార్ధుల నిరసనలను పోలీసులు ఎదుర్కొన్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఢిల్లీ పోలీసులు జాప్యానికి తావివ్వకుండా తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విద్యార్ధులు అభద్రతకు లోనయ్యే పరిస్థితి నెలకొందని, జేఏన్‌యూలో జరిగిన ఘటనలు మహారాష్ట్రలో తాను జరగనివ్వనని స్పష్టం చేశారు. యువతను రెచ్చగొట్టి వారితో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. జేఎన్‌యూలో దాడికి పాల్పడిన ముసుగుల వెనుక ఎవరున్నారో మనం తెలుసుకోవాలని..ముసుగు ధరించేవారు పిరికిపందలని, ధైర్యం ఉన్న వారు బహిరంగంగానే ముందుకువస్తారని అన్నారు. ఇలాంటి పిరికిపందల చర్యలను సహించే ప్రసక్తి లేదని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి దుండగుల దాడిలో 34 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడిండి ఏబీవీపీ కార్యకర్తలని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దాడి చేశారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. చదవండి : జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! -
ఠాక్రేపై పోస్ట్ : ఇంక్ చల్లిన మహిళ
ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిపై శివసేన మహిళా కార్యకర్త ఇంక్ చల్లిన ఘటన బీద్ జిల్లాలో వెలుగుచూసింది. ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఆ వ్యక్తి పనికిరాని, విధ్వంసకారుడు అనే పదాలను ఫేస్బుక్లో వాడారు. కాగా ఫేస్బుక్లో ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వారం ఓ ముంబై వ్యక్తిపై కొందరు శివసేన కార్యకర్తలు భౌతిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ సారథిగా ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 28న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. -
‘అది మరో జలియన్ వాలాబాగ్’
ముంబై : జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసుల చర్యను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. వర్సిటీలో పోలీసుల దమనకాండను జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పోల్చారు. యువశక్తి బాంబు వంటిదని, దానితో చెలగాటం తగదని హెచ్చరించారు. మహారాష్ట్రలో అధికార పంపకంపై గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన వైరిపక్షాలుగా మారిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా వర్సిటీ విద్యార్ధుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి వారిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మరోవైపు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి తమను అకారణంగా చితకబాదారని విద్యార్ధులు చెబుతున్నారు.పోలీసులు తమపై లాఠీచార్జ్‌కు దిగడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించి క్యాంపస్‌లో భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. జామియా మిలియా క్యాంపస్‌లో పోలీసుల దమనకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. -
ముంబైలో బాల్ ఠాక్రే - ఇందిరా గాంధీ పోస్టర్లు..
ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ మహారాష్ట్రలో గురువారం కొలువుతీరనున్న నేపథ్యంలో ముంబైలో సేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రే, దివంగత ప్రధాని ఇందిరా గాంధీల పోస్టర్లు వెలిశాయి. బాలాసాహెబ్ స్వప్నం ఫలించింది ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడని ఈ పోస్టర్లపై రాసిఉంది. గతంలో బాల్ ఠాక్రే, ఇందిరాగాంధీ భేటీ అయిన చిత్రాలతో కూడిన ఈ పోస్టర్‌ను శివసేన భవన్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు. రెండు భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల అధినేతలను ఒక్కటి చేస్తున్న ఈ పోస్టర్లను అందరూ ఆశ్చర్యంగా తిలకిస్తుండటం విశేషం. మరోవైపు శివసేన అధిపతి బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధానాలకు సంఘీభావం తెలిపేవారని, పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను ఆయన సమర్ధించారని శివసేన నేతలు గుర్తుచేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా ఆమె నిర్ణయాన్ని బాల్ ఠాక్రే సమర్ధించారు. 1966లో శివసేనను స్ధాపించిన బాల్ ఠాక్రే పార్టీ విధానాలకు అద్దంపట్టేలా సామ్నా పత్రికను నెలకొల్పారు. 2012లో 86 ఏళ్ల వయసులో ఆయన మరణించేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ సైతం ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
ఉద్ధవ్‌పై కేసు నమోదు
ఔరంగాబాద్ : ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న క్రమంలో ప్రజా తీర్పును ధిక్కరిస్తూ రాష్ట్ర ప్రజలను వంచించారని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఫిర్యాదు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ప్రజా తీర్పును అవమానించారని ఉద్ధవ్‌పై ఓ న్యాయవాది కేసు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్, శివసేన నేత ప్రదీప్ జైస్వాల్ పేర్లను కూడా న్యాయవాది రత్నాకర్ చౌరే తన ఫిర్యాదులో ప్రస్తావించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేతో సహా శివసేన, బీజేపీలు హిందుత్వ పేరుతో ఔరంగాబాద్‌లో ఓట్లు అభ్యర్థించాయని, ఎన్నికల అనంతరం కూటమి నుంచి ఉద్ధవ్ బయటకు రావడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని అన్నారు. ఇది ప్రజా తీర్పును వంచించడమేనని, సీఎం పదవి కోసం ఉద్ధవ్ రాష్ట్ర ప్రజలను మోసగించారని చౌరే ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రే, చంద్రకాంత్ పాటిల్, ప్రదీప్ జైస్వాల్లపై తమను మోసం చేశారని ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. శివసేన ప్రతిపాదించిన రొటేషనల్ సీఎం ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఇరు పార్టీల మధ్య దోస్తీ బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టుకట్టి ప్రభుత్వ ఏర్పాటకు శివసేన సంసిద్ధమైంది. శివసేన, ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగేలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మంత్రి మండలిలోనూ మూడు పార్టీలకు ప్రాతినిథ్యం దక్కేలా కసరత్తు కొలిక్కివచ్చినట్టు సమాచారం. -
‘మహా క్లారిటీ : ఉద్ధవ్‌కే సీఎం పగ్గాలు’
ముంబై\న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సర్కార్‌పై స్పష్టత వస్తోంది. అధికార పంపకంపై విస్తృతంగా చర్చిస్తున్న ఆయా పార్టీల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివసేన-ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. మరోవైపు రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఖరారు, లౌకిక స్ఫూర్తికి కట్టుబడటం వంటి కీలక అంశాలపై మూడు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పాలనా పగ్గాలు చేపడతారని, డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొరట్‌లు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక ఎన్సీపీ నూతన క్యాబినెట్లో మంత్రులపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా నిధులను మహారాష్ట్రలో సమస్యల బారిన పడిన రైతాంగానికి వెచ్చించాలనే అంశంపైనా సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నట్టు తెలిసింది. -
మందగమనంతో కొలువుల కోత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో చురకలు వేశారు. ఎవరు అంగీకరించినా లేకున్నా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొంటోందని, దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య ఉత్పన్నమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం ఉందా లేదా అన్నది తర్వాత తెలియవచ్చినా ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి..వ్యాపారాలు మూతపడుతున్నాయి..ఇది స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని మనం అంగీకరించా’లని పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్థవ్ ఠాక్రే స్పష్టం చేశారు. 2014 నుంచి శివసేన మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా ఎప్పుడూ తాము ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదని అన్నారు. ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పిదాలు జరిగినప్పుడు మాత్రం తాము తమ గళం వినిపించామని గుర్తుచేశారు. సంకీర్ణ సర్కార్‌లో సంయమనం అవసరమని, భాగస్వామ్య పక్షం దూకుడు పెంచితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలు గతంలో ఎదురయ్యాయని 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తుకు విఘాతం కలిగిన విషయాన్ని ప్రస్తావించారు. -
ఏకం చేసేది హిందూత్వమే
ముంబై: హిందూత్వ ఎజెం డాయే బీజేపీని, శివసేనను కలిపి ఉంచుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు. రెండు పార్టీల కలయిక విజయం చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శుక్రవారం ముంబైలో ఆయన మాట్లాడారు. మొత్తం 288 సీట్లలో శివసేన 124, ఎన్డీయే మిత్రపక్షాలైన ఆర్పీఐ, ఆర్ఎస్పీలు 14, బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. రెబల్ అభ్యర్థులను రెండు రోజుల్లోగా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతామని, లేకపోతే వారి స్థానమేంటో వారికే చూపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌నేత ఖడ్సేకు టికెట్ రాకపోగా, ఆయన కుమార్తె రోహిణికి ముక్తయినగర్‌లో సీటు కేటాయించారు. ఖడ్సే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిత్య భారీ విజయం ఖాయం.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య భారీ మెజార్టీతో గెలుస్తారని ఫడ్నవిస్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఆదిత్యను సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తులో (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఉండే చోటు) చూడాలనుకుంటున్నారని తెలిపారు. ఆదిత్య రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రెండు పార్టీల్లో పెద్దన్న (ఆధిపత్య పార్టీ) ఏదన్న చర్చలు లేనేలేవని పేర్కొన్నారు. -
‘సీట్ల సర్దుబాట్లపై త్వరలో ప్రకటన’
సాక్షి, న్యూఢిల్లీ : అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్ధుబాటును బీజేపీ-శివసేన కూటమి ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనుంది. సీట్ల సర్ధుబాటు ఒప్పందంపై తుది చర్చలు బీజేపీ అగ్ర నేత అమిత్ షా సమక్షంలో జరిగాయని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను శివసేన 128 స్ధానాల్లో, బీజేపీ 160 స్ధానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. కూటమిలోని ఇతర చిన్నాచితక పార్టీలకు 15 నుంచి 18 స్ధానాలను కట్టబెడతారని భావిస్తున్నారు. మరోవైపు హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం ఆదివారం జరగనుంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రకటించింది. 288 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ఇరు పార్టీలు చెరి 125 స్ధానాల్లో బరిలోకి దిగుతామని వెల్లడించాయి. మిగిలిన స్ధానాల్లో కూటమిలోని ఇతర చిన్న పార్టీలు పోటీ చేయనున్నాయి. -
రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్
ముంబై: వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన–బీజేపీ కలిసే పోటీ చేస్తాయని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరికెన్ని సీట్లనేది రెండ్రోజులు ప్రకటిస్తామని శుక్రవారం ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ముందే సీట్ల పంపకాలపై నిర్ణయించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఎవరికెన్ని సీట్లనేది ప్రకటిస్తామని చెప్పారు. ‘రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీచేస్తాయనేది మీడియానే ప్రచారం చేస్తోంది..’అని వ్యాఖ్యానించారు. అనంతరం శివసేన కార్యదర్శి అనిల్ దేశాయి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న బీజేపీ చీఫ్ అమిత్ షా ముంబై పర్యటన ఉన్న నేపథ్యంలో ఆలోపే సీట్ల పంపకాల గురించి ప్రకటిస్తామని చెప్పారు. శివసేన–126, బీజేపీ–162 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరి యాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు నేడు లేదా రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నా యని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే దీపావళి(అక్టోబర్ 27వ తేదీ)కి ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీల కు కూడా ఎన్నికలు జరిపే యోచనలోనూ ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. -
శివసేన గూటికి చతుర్వేది
న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. -
ఈ సందేశాల పరమార్థం ఏమిటి?
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివసేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. కానీ శివసేన ఎన్డీఏ నుంచి బయట పడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశా నికి కారణమిదే. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. భారత రాజకీయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు. కేవలం మారే స్వార్థ ప్రయోజనాలే కనిపి స్తుంటాయి. ఈ రాజకీయ పొత్తులు, అవి ముగిసి పోవడం–ఇవన్నీ కొన్ని లెక్కల ప్రకారం సాగుతుం టాయి. ఉత్తరాదిన వీటినే హిందీలో ‘జోడ్–తోడ్ రాజినీతి’ (కలయికలు–చీలికల రాజకీయం) అని పిలుస్తారు. అయితే, ఈ తరహా రాజకీయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నేను రాజకీయ విలే కరిగా ఉన్న రోజుల్లో భారత రాజకీయాల్లో గొప్ప గురువులుగా పేరొందిన ముగ్గురు నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎల్.కె.ఆడ్వాణీ, దివంగత సీతారాం కేసరీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది. ఇండియాలో రాజకీయాధికారం ఎలా నడు స్తుందనే విషయంలో విభిన్న అంశాలకు సంబం ధించి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ‘స్పెషలిస్ట్ ప్రొఫెసరే’. దేశంలో మొత్తం రాజకీయ శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన అధ్యాపకుడు∙ప్రణబ్‌దా అని నేనంటే ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తాను. 1980ల చివరి నుంచీ ఆడ్వాణీ తన పార్టీ బీజేపీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన ఈ పార్టీని 1989లో 85 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి, 1998లో అధికారంలోకి వచ్చే స్థితికి ఆయన తీసు కెళ్లారు. అనేక పార్టీలతో పొత్తుల ద్వారా సంకీర్ణ కూటమి నిర్మాణంతో విజయం సాధించవచ్చని ఆయన చెబుతారు. ‘‘మేం జాతి వ్యతిరేకమని భావించే పార్టీలు ఐదు ఉన్నాయి. వీటిని మిన హాయిస్తే మరెవరితోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అని ఆయన అంటారు. ఆడ్వాణీ దృష్టిలో ఈ ఐదు ‘అంటరాని’ పార్టీలు–కాంగ్రెస్, వామపక్షాలు, ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), లాలూ నడిపే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ముస్లింలీగ్(ఇలాంటి తరహా పార్టీలైన ఒవైసీల ఎంఐఎం, అస్సాం అజ్మల్ పార్టీ ఏఐయూడీఎఫ్ సహా). బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా వేరే దారి లేని శివసేన, శిరోమణి అకాలీదళ్, ఒక దశలో టీడీపీ ఆ పార్టీ పంచన చేరాయి. వీటిలో మొదటి రెండు పార్టీలూ తమ రాజకీయాలకు, అధికారం సాధించడానికి మతమే కీలకం కావడం వల్ల కాషా యపక్షంతో జతకట్టాయి. కాంగ్రెసే తన ఏకైక ప్రత్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆడ్వాణీ రూపుదిద్దిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉన్న మొదటి మిశ్రమ సర్కారు. అప్పటి వరకూ సీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ ‘అత్తగారి దేశంలో (ఇటలీ–సోనియా మాతృదేశం) సంకీర్ణ ప్రభుత్వాలు లక్షణంగా నడుస్తున్నప్పుడు ఇండి యాలో ఇవి ఎందుకు పనిచేయవు?’ అని గతంలో అన్నప్పుడల్లా జనం భయపడేవారు. తర్వాత ఆ ‘కూతురు’ (సోనియా) నిర్మించిన రెండు సంకీర్ణాలు పూర్తి కాలం పదేళ్లు అధికారంలో కొనసాగాయి. ‘సంకీర్ణ పరిస్థితులు’ పెద్దగా మారనే లేదు! ప్రధాన జాతీయపక్షాలు ఎప్పటికీ పొత్తు పెట్టుకోని పార్టీలు ఉన్నాయి. అలాగే, వేరే దారి లేక ప్రధాన పక్షాలతో చేతులు కలిపే పార్టీలూ ఉన్నాయి. రెండో తరహా పార్టీల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషన లిస్ట్ కాంగ్రెస్‌పార్టీ(ఎన్సీపీ) మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం కోసం సిద్ధాంతాలు వదులుకునే రాజకీయపక్షాలకు 75 నుంచి 150 లోక్‌సభ సీట్లు వస్తుంటాయి. అందుకే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజా రిటీకి అవసరమైన 272 సీట్లు ఎలా గెలవాలనే విష యానికి బదులు 160 వరకూ సీట్లు దక్కించుకునే ఇలాంటి పార్టీలపై చర్చ ఎక్కువవుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందునాటి స్థితికి మళ్లీ దేశం చేరుకుంటోందని పరిస్థితులు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవ కాశం లేదు. ఏ పార్టీకీ 272 సీట్లు రాని 1989 తర్వాత పరిస్థితికి చేరుకుంటున్నాం. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేకు ట్విటర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ‘‘శ్రీ ఉద్ధవ్ ఠాక్రేజీ, జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఆనం దంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అని సందేశం పంపడంలో పరమార్థం ఏమిటి? మనసులో ఓ మాట, పైకో మాట రాజకీయ నేతలకు సహజమే. రాజకీయ ప్రత్యర్థికి పుట్టినరోజు లేదా పండగ శుభా కాంక్షలు చెప్పడం సర్వసాధారణం. అలాగే, తన బద్ధ రాజకీయ ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి ఓ బడా నేత కావ లించుకోవడం చూసి మనం ఆశ్చర్యపడాల్సినది కూడా ఏమీ లేదు. కాని, ఉద్ధవ్‌కు రాహుల్ సందేశం విషయంలో మనం కొంత ఆలోచించక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడెవరూ బహిరంగంగా ఎవరికీ శుభా కాంక్షలు తెలిపిన సందర్భాలు లేవు. సైద్ధాంతికంగా పూర్తిగా అసహ్యించుకోవాల్సిన విలువలు పాటించే పార్టీ నేతకు దేశ ప్రజలందరూ చూసేలా ట్విటర్లో ఇలా గ్రీటింగ్స్ చెప్పడం వింతే మరి. కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా శివసేన మరింత అంటరాని పార్టీగా ఉండాలని రెండు పార్టీల నేపథ్యం చెబుతోంది. అదీ గాక, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట మిలో ముఖ్య భాగస్వామ్య పక్షం శివసేన. శివసేన అధినేతకు దగ్గరవడానికి రాహుల్ ఇప్పుడిలా బహిరంగ ‘ప్రేమలేఖ’తో ప్రయత్నిం చడం మూడు విషయాలను సూచిస్తోంది. ఒకటి, బీజేపీ– శివసేన మధ్య సంబందాలు దెబ్బతినడం ఆయన గమనించారు. రెండోది, 2019 ఎన్నికల్లో తన వ్యూహంపై మరింత స్పష్టత ఇచ్చారు. నేను కాకున్నా ఫరవాలేదు గాని, మోదీకి బదులు ఎవరు ప్రధానిగా అయినా అభ్యంతరం లేదనే విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఇక మూడోది, 2019లో దేశంలో సంకీర్ణయుగం మళ్లీ ఆరంభమైతే, రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఆడ్వాణీ చెప్పిన రీతిలో ఉండవనేది రాహుల్ అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టతనిచ్చిన రాహుల్ శత్రువు శత్రువు మిత్రుడనేది పాత మాట. నీ శత్రువు సన్నిహిత మిత్రునికి దగ్గరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావంటే దేశ రాజకీయాల్లో ఇది కొత్త పంథాకు సంకేతంగా కనిపిస్తోంది. బాగా బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలంటే సిద్ధాంతాలు పక్కనపెట్టి, కొత్త పోకడలకు తెరతీయవచ్చనే తెలివి రాహుల్‌కు వచ్చి నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఎవరు దేశాన్ని పరిపాలిస్తారనే విషయం మళ్లీ చర్చకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికలను నేను తరచు తొమ్మిది సెట్ల టెన్నిస్ మ్యాచ్‌తో పోల్చేవాడిని. ఎవరు ఐదు సెట్లు గెలుస్తారో వారే విజేత. భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. వచ్చే ఎన్ని కల్లో ‘తొమ్మిది సెట్లు’గా చెప్పే రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణా టక, కేరళ. ఇవి పెద్దవి కావడంతో 9 రాష్ట్రాల జాబి తాలో చేర్చాను. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మార్పు అనేది సాధ్యమౌతుంది. అందుకే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ను చేర్చలేదు. ఈ 9 రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్లు 342. వీటిలోని ఐదు రాష్ట్రాల్లో గెలిచే సంకీర్ణ కూటమికి దగ్గరదగ్గర 200 వరకూ సీట్లు దక్కే అవకాశముంది. లేకున్నా 160కి పైగానే స్థానాలు తప్పక లభిస్తాయి. అందుకే 2014 వరకూ 272 సీట్ల గెలుపుకున్న ప్రాధాన్యం ఇక 160 సీట్ల కైవసం చేసుకోవడానికి లభిస్తుందని అనుకోవచ్చు. యూపీలో బీజేపీకి సగంపైగా సీట్లు గల్లంతే! మోదీ–అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడ టమే అత్యంత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరప్ర దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే బీజేపీకి ఘన విజయం దక్కదు. 2014లో గెలిచిన 73 సీట్లలో సగం కూడా గెలవడం కష్టం. అప్నాదళ్ వంటి చిన్న మిత్రపక్షాలు సైతం బీజేపీతో కలిసి ఉంటాయా? అంటే చెప్పడం కష్టం. అలాగే, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో బీజేపీ బలం బాగా తగ్గుతుంది. ఈ నష్టాలను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసు కోవాలని బీజేపీ అనుకుంటోంది. కాబట్టి, యూపీ తర్వాత అత్యధిక ఎంపీలను పంపే అంటే 48 లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్రలో బలం నిలబెట్టుకోవడమే బీజేపీ అతి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహా రాష్ట్రలో శివసేన సాయం లేకుండా ఒంటరి పోరుతో విజయం సాధించడం గురించి అమిత్ షా తన పార్టీ శ్రేణులను సమీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, శివసేన లేకుండా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోలేదనే విషయం ఆయనకు తెలుసు. రాహుల్కీ ఈ వాస్తవం తెలుసు. 2019 లోక్ సభ ఎన్నికలు నేను పైన చెప్పినట్టు 9 సెట్ల టెన్నిస్ మ్యాచ్‌లా మారితే, మహారాష్ట్రలో బీజేపీ (ఎన్డీఏ) గెల వకుండా రాహుల్ సాధ్యమైనంత కృషిచే యాలి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివ సేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. శివసేన ఎన్డీఏ నుంచి బయటపడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశానికి కారణమిదే. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసం గిస్తూ, ఇదే తరహాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ‘వికాస్ పురుష్’ అంటూ ఆయనపై ప్రశం సలు కురిపించారు. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిçస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అవసరమైతే కోర్టుకెళతాం..
సాక్షి, ముంబయి : ఉప ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తనదైన శైలిలో స్పందించారు. పాల్ఘర్ ఉప ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ మన ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియకు ముప్పు వాటిల్లిందని, దీనిపై అవసరమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయిస్తామని అన్నారు. పాల్ఘర్ స్ధానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్‌లో కొన్ని లోటుపాట్లు చోటుచేసుకున్నాయని, వీటిని పరిష్కరించేవరకూ ఫలితాలను ప్రకటించరాదని ఆయన కోరారు. అతితక్కువ మార్జిన్‌తో తాము ఇక్కడ ఓడిపోయామని అన్నారు. చివరినిమిషంలో ఓటర్ల జాబితాలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్లోనూ అవినీతిని చూసిన మీదట ఎన్నికల కమిషనర్లను నియమించరాదని, వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటమి పాలయిన యోగి ఆదిత్యానాథ్ ఇక్కడ (మహారాష్ట్ర) ప్రచారానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీని యోగి అవమానించడాన్ని తాము మరిచిపోమని హెచ్చరించారు. బీజేపీ రెండు లోక్‌సభ స్ధానాల్లో పరాజయం పొందడంతో ఆ పార్టీ హవా కనుమరుగవుతోందన్నారు. -
బీజేపీకి ఝలక్.. వద్దంటే వదిలేయండి!
సాక్షి, ముంబై : ‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన ఘాటుగా బదులిచ్చింది. ‘మాతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయండి’ అని సేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ-సేన మైత్రికి తెరపడే అవకాశాలున్నట్లు ఊహాగానలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్లే నేతల విమర్శలు కూడా శృతిమించాయి. త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? : గతవారం ఓ కార్యక్రమంలో సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపై ఎడతెగని విమర్శలు గుప్పించడం శివసేనకు తగదని, సంకీర్ణప్రభుత్వంలో ఉండాలో బయటికి వెళ్లాలో ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందోసారి.. శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చని సీఎం అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన నారాయణ రాణేకు ఫడ్నవిస్ తన కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు : సందర్భం చిక్కినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా సెటైర్లు వేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సోమవారం కూడా అదేపని చేశారు. శివసేనకు బీజేపీ సైద్ధాంతిక శత్రువని, కేవలం ప్రభుత్వం నడవటం కోసమే తాము మద్దతు ఇచ్చామని అన్నారు. అంతకుముందు ఆయన.. మోదీ ప్రభ తగ్గిపోయిందని, రాహుల్ గాంధీయే దేశాన్ని నడిపించగల నాయకుడని చేసిన వ్యాఖ్యలు సేన-బీజేపీల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. రౌత్‌కు కౌంటర్‌గా సీఎం ఫడ్నవిస్ సవాలు చేస్తే, ఇప్పుడు ఫడ్నవిస్‌కు సేన ఘాటు సమాధానమిచ్చింది. -
బీజేపీలో చేరట్లేదు.. ప్రతిపక్షంలోనే..!
-
దమ్ముంటే పోటీ చేయ్
సాక్షి, ముంబై: ఒక్కసారి...ఒకే ఒక్కసారి ఎన్నికల్లో పోటీచేసి చూడు, నీ స్థానమేంటో రాష్ట్ర ప్రజలు చూపిస్తారని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సవాల్ విసిరారు. నాసిక్‌లో ఎన్సీపీ లోక్‌సభ అభ్యర్థి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఛగన్ భుజ బల్కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పవార్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నానని తనపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బాలుడా (ఉద్ధవ్) నేను 14 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీచేశాను. 14 సార్లు గెలిచాను కూడా. ఉద్ధవ్ ఒంటెపై కూర్చుండి నేను చాలా ఎత్తు ఎదిగానని విర్రవీగుతున్నాడు. ఏ పార్టీని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ పార్టీ ఎవరు స్థాపించారో తెలుసా..? శివసేన పార్టీని మీ తండ్రి, దివంగత అధినేత బాల్‌ఠాక్రే స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి గుర్తింపు రావడానికి అందుకు ఆయన ఎంతో కృషి చేశార’ని పవార్ గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేవాడినైతే 14 సార్లు పోటీ ఎలా చేస్తాను..? ఎలా గెలుస్తాను..? అని ఉద్ధవ్‌ను నిలదీశారు. ‘ఎన్నికలంటే తనకు భయమని చెప్పడం కాదు, జీవితంలో ఒక్కసారైన ఎన్నికల్లో పోటీ చేసి చూపించు. దిగితే తప్ప బావి లోతు తెలియదంటారు. ఎన్నికల బరిలోకి దిగి చూపించు....ఎవరికి భయమేస్తుందో తెలుస్తుంద’ ని ఆయన చురక అంటించారు. ఈ సభలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, వినాయక్ పాటిల్, ఎంపీ సమీర్ భుజబల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కోకాటే, ఎన్సీపీ కార్యధ్యక్షుడు జితేంద్ర అవ్హాడ్, మాజీ మంత్రులు తుకారాం దిఘోలే, లక్ష్మణ్ డోబలే తదితరులు పాల్గొన్నారు. -
పులికి ఘన నివాళి
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బాలాసాహెబ్ ఠాక్రే ప్రథమ వర్ధంతిని శివసేన అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహిం చిన శివాజీపార్క్ మైదానం ‘బాల్‌ఠాక్రే అమర్ రహే’ నినాదాలతో ఆదివారం హోరెత్తింది. ఉద యం నుంచే నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చిన శివసైనికులు, తమ ప్రియతమ నాయకుడు బాల్ ఠాక్రేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన శివాజీపార్క్ మైదానంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసి పోయాయి. శివాజీపార్క్ మైదానం ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న మీనాతాయి ఠాక్రే విగ్రహాన్ని భారీగా పూలతో అలంకరిం చారు. శివసైనికులు ముందుగా మీనాతాయి విగ్రహానికి నివాళులర్పించి ఠాక్రే స్మారకం వద్దకు వెళ్లా రు. మైదానమంతా జనసంద్రంగా మారింది. 1966 లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే దానిని మహా రాష్ట్రలో బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నవంబర్ 17న మరణించారు. భారీగా ప్రముఖుల రాక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రశ్మి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్మారకం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేన సీని యర్ నాయకులు, కార్పొరేటర్లతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, కూతురు సుప్రియా సుళే, గవర్నర్ కె.శంకరనారాయణన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై ఠాక్రేకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వర్ధంతికి హాజరుకాకపోవడం గమనార్హం. అభిమానుల సందడి.. రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, ఠాక్రే అభిమానులు శనివారం సాయంత్రం నుంచి ముంబైకి తరలిరావడం మొదలుపెట్టారు. తదనంతరం బాంద్రాలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ బంగ్లాకు చేరుకున్నారు. చాలా మంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే శివాజీపార్క్ మైదానానికి చేరుకుని క్యూలో నిలబడ్డారు. నివాళులర్పించే బోర్డులు, ప్లెక్సీలు.. ఠాక్రేకు నివాళులర్పించడానికి అమర్చిన బోర్డులు, ఫ్లెక్సీలు ముంబైలో చాలాచోట్ల దర్శనమిచ్చాయి. ‘శివ్తీర్థ్’ వద్ద ఉన్న శివాజీ విగ్రహం పక్కన 20 అడుగుల వెడల్పు, 40 అడుగులు పొడవుతో ఠాక్రే స్మారకం ‘స్మృతి ఉద్యాన్’ను బీఏంసీ ఏర్పాటు చేసింది. దీనిని 15 రకాల పూలు,మొక్కలతో అలంకరించారు. భారీగా పోలీసు బందోబస్తు వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ముంబై పోలీసుశాఖ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రద్దీని నియంత్రించేందుకు శివ్తీర్థ్ వద్ద ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌రూం, రెండు వాచ్టవర్లు ఏర్పాటు చేశారు. 650 మంది కానిస్టేబుళ్లు, 225 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది పోలీసు అధికారులు, నలుగురు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లను నియమించారు. అలాగే స్టేట్ రిజర్వుడు పోలీసులకు చెందిన మూడు బెటాలియన్లు, అల్లర్ల నియంత్రణకు రెండు బెటాలియన్లు, ఐదు కంబాట్ వాహనాలతో భద్రత ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు.... వర్ధంతిని పురస్కరించుకుని శివసేన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. శివసేన సినిమా యూనియన్ ఆధ్వర్యంలో దాని సభ్యులకు రూ.రెండు లక్షల పాలసీ ఉచితంగా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్‌కార్డులు అందజేస్తామని సేవ వర్గాలు తెలిపాయి. మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : ఉద్ధవ్ శివాజీపార్క్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రమే ఉద్ధవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మేయర్ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, రాష్ట్ర పాలనలో మార్పు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలోని శివసేన, బీజేపీ, ఆర్పీఐకి అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొద్ది రోజులుగా స్వాభిమాన్ శేత్కారి సంఘటన నాయకుడు, ఎంపీ రాజుశెట్టి చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఠాక్రే చేసిన పనులు, మార్గదర్శకాలు భావితరానికి ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు.