ఠాక్రేపై పోస్ట్‌ : ఇంక్‌ చల్లిన మహిళ | Sena Worker Pours Ink On Man For Criticising Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

ఠాక్రేపై పోస్ట్‌ : ఇంక్‌ చల్లిన మహిళ

Published Wed, Jan 1 2020 1:59 PM | Last Updated on Wed, Jan 1 2020 3:11 PM

Sena Worker Pours Ink On Man For Criticising Uddhav Thackeray - Sakshi

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తిపై శివసేన మహిళా కార్యకర్త ఇంక్‌ చల్లిన ఘటన బీద్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి ఆ వ్యక్తి పనికిరాని, విధ్వంసకారుడు అనే పదాలను ఫేస్‌బుక్‌లో వాడారు. కాగా ఫేస్‌బుక్‌లో ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వారం ఓ ముంబై వ్యక్తిపై కొందరు శివసేన కార్యకర్తలు భౌతిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ సారథిగా ఉద్ధవ్‌ ఠాక్రే నవంబర్‌ 28న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement