పవార్‌, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్‌ | Sharad Pawar Maharashtra Home Minister Anil Deshmukh Receive Threat Calls | Sakshi
Sakshi News home page

పవార్‌, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్‌

Published Mon, Sep 7 2020 5:37 PM | Last Updated on Mon, Sep 7 2020 5:43 PM

Sharad Pawar Maharashtra Home Minister Anil Deshmukh Receive Threat Calls - Sakshi

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు బెదిరింపు కాల్స్‌ వచ్చిన మరుసటి రోజే ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌లకు సోమవారం బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఇద్దరు నేతల నివాసానికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, పవార్‌, దేశ్‌ముఖ్‌లకు దేశం వెలుపల నుంచి ఈ కాల్స్‌ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించారు.

కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం బాంద్రాలోని మాతోశ్రీని పేల్చేస్తామని శనివారం బెదిరింపు కాల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ నుంచి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తరపున తాను కాల్‌ చేస్తున్నానని ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పినట్టు అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగంతకుడు రెండు సార్లు కాల్‌ చేశాడని, దీంతో ఠాక్రే బంగళా వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చదవండి : శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement