ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట ఉన్న భద్రతా సిబ్బందిలోని ముగ్గురు పోలీసులకు శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ముగ్గురు పోలీసులు సీఎం నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని తెలుస్తోంది. సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం ఇంటి వద్ద ఉన్న పోలీసులను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న భద్రతా సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నారు. (కరోనా : నాందేడ్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్)
ఇక మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 485 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 37,776కి చేరగా 1218 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. (కాంక్రీట్ మిక్సింగ్ ట్రక్కులో 18 మంది)
Comments
Please login to add a commentAdd a comment