ముంబై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తల్లి ఆశా రనౌత్ తప్పుపట్టారు. తమ కుమార్తె పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. యావత్ దేశం తమ కుమార్తె వెంట ఉందని, ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని చెప్పారు. సత్యం వెంట నిలిచే తన కుమార్తెను చూసి గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. కంగనాకు భద్రత కల్పించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కంగనాకు భద్రత కల్పించకపోతే ఆమెకు ఏం జరిగేదో ఎవరూ ఊహించలేరని అన్నారు.
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై ముంబై పోలీసులకు రెండు ఫిర్యాదులు అందాయి. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి ముంబై పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదన్న బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలో ఉండరాదని కంగనాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చెలరేగింది. బుధవారం ముంబైలో కంగనా అడుగుపెట్టిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అక్రమ కట్టడం అంటూ కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చడం కలకలం రేపింది. దీనిపై కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతపై కోర్టు స్టే విధించింది. చదవండి : ఠాక్రేపై వ్యాఖ్యలు : కంగనాపై పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment