ఘనంగా శివసేన స్వర్ణోత్సవాలు | Shiv Sena celebrated its Golden Jubilee | Sakshi
Sakshi News home page

ఘనంగా శివసేన స్వర్ణోత్సవాలు

Published Mon, Jun 20 2016 1:36 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

ఘనంగా శివసేన స్వర్ణోత్సవాలు - Sakshi

ఘనంగా శివసేన స్వర్ణోత్సవాలు

ముంబై సెంట్రల్: మహారాష్ట్ర సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన పార్టీ ఆవిర్భవించి ఆదివారానికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు చోట్ల స్వర్ణజయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముంబైలోని గోరేగావ్‌లోని ఎన్‌ఎస్‌ఈ మైదానంలో జరిగిన  సభలో పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే ప్రసంగించారు. ‘నిస్సహాయంగా ఒకరి వెంట నడిచే భాగస్వామ్యం మనకు అవసరం లేదు. బీజేపీతో సంబంధం ఎప్పుడు తెగిపోతుందో చెప్పలేను.

ముంబైతోపాటు త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేద్దామ’ని అన్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తూనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ పదాధికారులు, వేలాది పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివసేన పార్టీకి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ‘శివసేన అధ్యక్షుడు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. మహా నాయకుడు బాలాసాహెబ్ థాక్రే మార్గదర్శనం చాలా విలువైనది’ అని ఫడ్నవిస్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement