ట్రంప్ కాన్వాయ్‌లో భాగంకానున్న అమెరికా వాహనం
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక కోసం చేస్తున్న ఏర్పాట్లపై శివసేన మండిపడింది. ఆత్రుతగా ఎదురుచూస్తూ ఏర్పాట్లు చేయడం.. భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబి స్తోందని వ్యాఖ్యానించింది. ట్రంప్ రాక.. ‘బాద్‌షా’ (మహారాజు) పర్యటన లాగా ఉందని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ పర్యటించనున్న మార్గంలో మురికి వాడలు కన్పించకుండా గోడ కట్టడంపైనా తీవ్ర విమర్శలు చేసింది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా రూపాయి విలువ పెరగదని, మురికి వాడల్లో ఉండే వారి జీవితాలేమీ మెరుగు పడవని పేర్కొంది. ‘స్వాతంత్య్రానికి పూర్వం.. బ్రిటిష్ రాజు లేదా రాజు తమ బానిసత్వపు దేశాల్లో పర్యటించి నప్పుడు ఇలాగే ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అచ్చు అలాగే ప్రజల పన్నుల సొమ్ముతో ట్రంప్ పర్యటన కోసం మెరుగులు దిద్దుతున్నారు. ఇది భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment