criticizes
-
చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
విశాఖపట్నం: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన మహిళా ద్రోహి చంద్రబాబని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులకు పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు కాదా?. చంద్రబాబు పాలనలో మహిళా అధికారి వనజాక్షిని దారుణంగా కొట్టారని, దళిత మహిళలను వివస్త్రతను చేసి దాడులు చేశారని ధ్వజమెత్తారు. పవన్, చంద్రబాబు మాటలను చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. చంద్రబాబు కుటుబంలో వాలంటీర్లు ఏమైనా గొడవలు పెట్టారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? అని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా..? అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్‌తో గొడవ పడి చంద్రబాబు పామ్ హౌస్‌లో కాపురం ఉండడానికి వాలంటరీలు కారణమా..? మహిళల పట్ల గౌరవం లేని సంస్కారహీనుడు పవన్ కళ్యాణ్ అంటూ దుయ్యబట్టారు. పవన్ తల్లిని చంద్రబాబు లోకేష్ దారుణంగా అవమానించారు అయినప్పటికీ సిగ్గు లేకుండా అదే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే.. 1.పరిపాలనలో విప్లవాన్ని తీసుకొచ్చారు గత నాలుగేళ్లుగా సీఎం జగన్ గారు సరికొత్త ఆలోచనలతో, నూతన సంస్కరణలతో పరిపాలనలో విప్లవాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్.. మా భవిష్యత్ నువ్వే జగనన్న అంటున్నారు. ఏ జాతీయ మీడియా సర్వేలు చూసినా... వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వస్తున్నాయి. 2. గ్రామ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం దేశానికే ఆదర్శమైన గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా పథకాలు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. అలాగే పథకాల అమలులో ఒక్క శాతం లబ్ధిదారుడు కూడా మిగిలిపోకూడదని జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే గొప్ప పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ గారికి ప్రలజందరూ నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల్లో అయితే జగన్ గారి ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంతగా పెరిగింది.. - మహిళల్లో, ప్రజల్లో జగన్ గారి ఇమేజ్ ను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ ఫ్రస్టేషన్ కి లోనై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎల్లోమీడియా రేటింగ్స్, చంద్రబాబు ట్రైనింగ్, పవన్ కల్యాణ్ ప్రాంప్టింగ్.. ముగ్గురు కలిపి జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు 3. అది మహాశక్తి కాదు మాయాశక్తి... చంద్రబాబు మహిళల కోసం ఏర్పాటు చేసిన మహాశక్తి కార్యక్రామాన్ని చూసి మహిళలు నవ్వుకుంటున్నారు. మహిళా ద్రోహి అయిన చంద్రబాబు మహిళోద్దారకుడిలా బిల్డప్ లు ఇస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మహిళల్ని నిట్టనిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. మహిళల పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చే ముందు రూ.14,500కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తివేసిన మహిళా ద్రోహి చంద్రబాబు. మహిళలు చదువుకోకుండా అడ్డుకోవడానికి.. ఫీజు రీయింబర్స్ మెంట్ లో కోతలు విధించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలనలో అడుగడుగునా మహిళలకు రక్షణ లేదు... రిషితేశ్వరి విషయంలో కాంప్రమైజ్ చేయడానికి యత్నించిన వ్యక్తి చంద్రబాబు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చికోడితే సపోర్ట్ చేసిన వ్యక్తి, మహిళా ద్రోహి చంద్రబాబు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో కొన్ని వేల మంది మహిళలు ఎంతో ఇబ్బందిపడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ కు కారణమైన వారికి మద్దతిచ్చిన మహిళా ద్రోహి చంద్రబాబు. దళిత మహిళను కాలితో తన్ని అవమానపర్చిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి చంద్రబాబు మహిళలను ఉద్ధరిస్తాడంటే నమ్ముతారా..? 4. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు... డీబీటీ ద్వారా పారదర్శకంగా, ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి తావులేకుండా రూ.2,26,000కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించారు. దీనిలో కూడా 75శాతం పథకాలు మహిళలకే అందిస్తున్నారు.. మహిళలకు అనునిత్యం అండదండగా నిలబడిన సీఎం జగన్ గారిని మహిళా ద్రోహి అని చంద్రబాబు అనే సైకో అంటున్నాడు. సైకో ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు..! సైకో ఎవరో సొంత మామైన ఎన్టీఆరే చెప్పారు. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు అని ఎవర్ని అడిగినా చెబుతారు.. టీడీపీ గుర్తు సైకిల్.. టీడీపీ పాలన సైకో పాలన.. అలాంటి చంద్రబాబు జగన్ గారిని విమర్శిస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు, సీఎం జగనన్న పాలన పోల్చి చూస్తే నక్కకు నాకలోకానికి ఉన్నంతా తేడా ఉంది మహిళా ద్రోహి అయిన చంద్రబాబు పాలన మహిళా కక్షపాత పాలన.. జగన్ గారి పాలన మహిళా పక్షపాత పాలన.. చంద్రబాబు పాలన అనకొండ పాలన.. జగనన్న పాలన మహిళలకు అండగా ఉండే పాలన... చంద్రబాబు పాలన అరాచక పాలన అయితే.. జగనన్న పాలన మహిళల్ని ఆదరించే పాలన... చంద్రబాబు పాలన నారా-నరకాసురుల పాలన అయితే.. జగనన్న పాలన నవశకం పాలన... చంద్రబాబు పాలన దుశ్శాసన పాలన అయితే జగనన్న పాలన మనస్సుని టచ్ చేసే పాలన. మనసున్న గొప్ప ముఖ్యమంత్రి జగనన్న. 5. ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబంలో గొడవలు సృష్టించారు బాబూ..? - వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని దారుణంగా, నీచంగా మాట్లాడుతున్నారు. - 75 ఏళ్ల వయసు, 44ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు వాలంటీర్లను ఉద్ధేశించి ఆ విధంగా మాట్లాడవచ్చా? వాలంటీర్లు కుటుంబాల్లో గొడవలు సృష్టిస్తున్నారు అని మాట్లాడుతున్నారే.. ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబంలో గొడవలు సృష్టించారు చంద్రబాబు... ? కుటుంబాల్లో గొడవలు సృష్టించడం, సొంత మామని వెన్నుపోటు పొడవడం, సొంత భార్యను అడ్డంపెట్టుకుని మామను గద్దెదించి సీఎం అవడం.. ఇలాంటి పనులు మన రాష్ట్రంలో చేసేది మీరే.. వాలంటీర్లు కాదు. - కోవిడ్ సమయంలో మీరు. మీ కొడుకు లోకేష్ గొడవులు పడ్డారని.. మీ భార్య భువనేశ్వరి, మీ కోడలు బ్రాహ్మణి గొడవలు పడ్దారని.. అలిగి మీరు, మీ భార్య ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని ప్రజలందరూ అనుకున్నారు.. ఈ గొడవలన్నీ ఏ వాలంటీర్ పెట్టారు చంద్రబాబు.? ఈ గొడవలు ఏ వాలంటీర్ పెట్టలేదు కదా..? - వాలంటీర్లను చులకన చేసి, అవమానించి మాట్లాడిన చంద్రబాబు వాలంటీర్లకు, ముఖ్యంగా మహిళా వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. 6. ప్రతి ఇంటికి చందమామను తెచ్చి ఇస్తాను అంటాడు.. - నిన్న టీడీపీ మహాశక్తి కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి, రాష్ట్రంలో ప్రతి ఇంటికి చందమామను తెచ్చి ఇస్తాను అని మాయమాటలు చెప్పే విధంగా ఉన్నాయి - అది మహాశక్తి మీటింగ్ కాదు మాయాశక్తి మీటింగ్.. వారిది తెలుగు మహిళా విభాగం కాదు తెలుగు మహిళల పాలిట దగా విభాగం.. తెలుగు మహిళా ద్రోహుల పార్టీ.. టీడీపీ అని మహిళలందరూ భావిస్తున్నారు.. 7. టీడీపీ మేనిఫెస్టో ఔట్ డేటెడ్ ప్రొడక్ట్.. వారంటీ లేని ప్రొడక్ట్.. జగనన్న ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడితే కానీ మీ మేనిఫెస్టో తయారుకాలేదు. అలాంటి మీకు మా జగనన్న పథకాలను కామెంట్ చేసే అర్హత లేదు. -జగనన్న పథకాలకు అత్తరు పూసి, జగనన్న ఆలోచనలకు రంగులు అద్ది, జగనన్న పాలసీలకు పౌడర్ పూసి మీ మేనిఫెస్టో తయారు చేశారు.. అటువంటి మీ మేనిఫెస్టో ఔట్ డేటెడ్ ప్రొడక్ట్.. వారంటీ లేని ప్రొడక్ట్. ఔట్ డేట్ అయిన ప్రొడక్ట్ ను చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ప్రజలు మళ్లీ మీకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.. -మీరు చెప్పే మాటలు కసాయి వాడు వెళ్లి మేకలకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తాను అనేలా ఉన్నాయి.. మూడుసార్లు సీఎంగా చేసి మీరు అమలు చేయని పథకాలు ఈరోజు చేస్తానని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకు, మహిళలకు లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి.. రాష్ట్రంలో తల్లులకు పంగనామం అనే పథకం చంద్రబాబు అమలు చేశారు. మళ్లీ ఈరోజు తల్లికి వందనం.. అంటూ మభ్యపెట్టడానికి కొత్త పథకం అంటున్నారు.. మిమ్మల్ని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ గారు అమ్మఒడి పథకం ద్వారా 44లక్షల మంది మహిళలకు రూ.26వేల కోట్లు ఇవ్వడం జరిగింది. ఆసరా పథకం ద్వారాం 80లక్షల మందికి రూ.25వేల కోట్లు ఇవ్వడం జరిగింది. చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మహిళలను ఆదుకుంటున్నారు. 31లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది.. మీ 14ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టారా? చంద్రబాబు. 31లక్షల ఇళ్ల మాట దేవుడెరుగు.. కనీసం 3లక్షల ఇళ్లు అయినా ఇచ్చారా? అమ్మఒడి లాంటి పథకం మీ 14ఏళ్ల పాలనలో కనీసం 14 మందికి ఇచ్చారా.. ? -14 ఏళ్ల పాలనలో ప్రజలకు రూపాయి కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు ఏదో చేసేస్తాను అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.. మహిళలు ఏమీ చెవిలో పూలు పెట్టుకోలేదు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి, మీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తీసేసిన వ్యక్తి చంద్రబాబు.. మళ్లీ అబద్దాపు హామీలతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. 8. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ జగనన్న.. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి 99శాతం అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మా జగనన్న.. జగనన్న ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. మహిళలు కూడా జగనన్న మీద ఎంతో అనుబంధాన్ని చూపిస్తూ.. అనుబంధానికి బ్రాండ్ అంబాసిడర్ లుగా మహిళలు ఉన్నారు మహిళా సాధికారితకు ఉదాహరణ జగనన్న పరిపాలన అయితే.. మహిళా ద్రోహానికి బెస్ట్ ఉదాహరణ చంద్రబాబు పాలన... దుర్మార్గమైన పాలన అందించిన మిమ్మల్ని, ఈరోజు మీ కాకమ్మ కబుర్లని ప్రజలు నమ్మరు.. 9. మీ గెజిట్ ఈనాడులోనే "జన్మభూమిలో నేతల మేత" అని ఫస్ట్ పేజీలో రాశారు.. వాలంటీర్ల మీద బురదజల్లితే తిరిగి మీమీదే పడుతుంది. టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనిత మాటలు, భాష చూసి మహిళలందరూ సిగ్గుపడుతున్నారు.. ఆడవారిని వాలంటీర్లు లోబర్చుకుంటున్నారని అనడానికి సిగ్గులేదా? మీ ప్రభుత్వంలో పథకాలు కోసం కాళ్లు అరిగేటట్టుగా తిరిగేవారు.. ఈరోజు పేద ప్రజల గడప దగ్గరకి వెళ్లి వాలంటీర్లు పథకాలు అందిస్తుంటే.. ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుగా లేదా? పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన చెత్త పనులే.. వాలంటీర్లు చేస్తున్నారని అనిత మాట్లాడుతున్నారేమో.. జన్మభూమి కమిటీలు అవినీతికి మారుపేరు.. జన్మభూమి కమిటీల చిట్టా చూస్తే.. మీ ప్రభుత్వంలో, మీ పార్టీ గెజిట్ అయిన ఈనాడు పత్రికలో 2017 ఆగస్టు 11న "జన్మభూమిలో నేతల మేత" అని ఫస్ట్ పేజీలో రాశారు.. "జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసినవారే పథకాలకు అర్హులు, గ్రామసభలు ఉండవు, రుణాలకు లంచాల రేట్లు, జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం, ఎక్కడ చూసినా లంచం.. లంచం.. లంచం.. పింఛన్ కు రూ.3వేల నుంచి 5వేల లంచం, రుణం కావాలంటే రూ.10వేలు లంచం, ఇల్లు మంజూరు కావాలంటే రూ.15వేలు, కార్పొరేషన్ నుంచి రుణం పొందాలంటే రూ.25 వేల నుంచి 37వేల లంచం ఇవ్వాలి, మరుగుదొడ్డు మంజూరు కావాలంటే రూ.1500 ఇవ్వాలి.. ఎన్టీఆర్ గృహ పథకం రూ.20వేలు లంచం.." అని మీ గెజిట్ ఈనాడులో రాశారు.. ఇది మీ జన్మభూమి కమిటీల తాలుకా అరాచక చరిత్ర.. జన్మభూమి కమిటీలకు, వాలంటీర్లకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దగ్గర చులకన అవుతారే తప్ప సాధించేంది ఏమీ లేదు 10. నారాహి యాత్రలో ఊగిపోతున్న పవన్.. -వారాహి అని నారాహి యాత్ర చేస్తు.. పవన్ ఊగిపోతూ, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. వాలంటీర్లు మహిళ అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాలంటీర్లలో 70శాతం ఉన్న మహిళలు.. మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే మీకు మహిళలు అంటే ఎంత గౌరవమో అర్థం అవుతుంది.. - జగనన్న వలన మహిళలు రాజకీయాల్లోకి రావట్లేదని అనడానికి నోరు ఎలా వచ్చింది పవన్ కల్యాణ్.. జగనన్న ఏర్పాటు చేసిన ఏ సమావేశ వేదిక మీద మహిళలు ఎంతమంది ఉంటున్నారు.. మీ మీటింగ్ లలో ఎంతమంది మహిళలు ఉంటున్నారు.? మీ వారాహి రథం మీద ఒక్క మహిళా ఉందా? మా జగనన్న మీటింగ్స్ లలో 50శాతం పైగా మహిళలు కనిపిస్తారు.. -జగనన్న నలుగురు మహిళలకు మంత్రి పదవులతో పాటు, మండలి డిప్యూటీ ఛైర్మన్ మహిళకు అవకాశం ఇచ్చారు, ఎంతోమంది మహిళలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు.. 50శాతం పైగా నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు.. 50శాతానికి పైగా మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు , కార్పొరేషన్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్లన్లు గా మహిళలు ఉన్నారు.. మహిళలను ఎంతగానో గౌరవిస్తూ, ఆదరిస్తున్న ఏకైక వ్యక్తి జగన్ గారు.. మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతస్థానాల్లో కూర్చొపెట్టడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. దిశచట్టం, దిశయాప్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు - జగనన్న పాలనలో ఇంట్లో ఉన్న మహిళలు కూడా రాజకీయాల్లోకి ధైర్యంగా వచ్చి తిరుగుతున్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా, మహిళలకు రాజ్యాంగం కల్పించిన పదవుల కంటే ఎక్కువ పదవులు ఇచ్చారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలివారు వరకు పథకాలు మహిళలకు అందుతున్నాయి. రాష్ట్రంలోని మహిళలు అంతా నమ్మేది కూడా జగన్ గారినే.. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చిప్రేలేపనలు మాట్లాడితే ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో గడ్డి తినిపించి, బుద్ది చెప్పి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు 11. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది.. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు.. రాష్ట్రంలో ఉన్న మహిళలందర్ని సొంత తల్లి, చెల్లిని ఏ విధంగా గౌరవిస్తారో అదే విధంగా, ఎంతో ఆప్యాయయంగా పలకరిస్తూ గౌరవిస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు పొందే అంత గొప్పగా భారతమ్మ పిల్లల్ని పెంచారు. - జగన్ గారి సభల్లో ఎక్కడైనా.. మీ భార్య పిల్లల్ని గానీ ఒక్క మాట అన్నారా? పవన్.. మీరు మా ప్రభుత్వంలోని మహిళల్ని, ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని పేరు పెట్టి కించపరుస్తూ, అవమానిస్తూ మాట్లాడారు.. జగనన్న ఏనాడు అలా చేయలేదు.. కాబట్టి జగన్ గారిని చూసి సంస్కారం నేర్చుకుంటే బాగుంటుంది పవన్ కల్యాణ్.. భారతమ్మగారి పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు.. మీ తల్లిని చంద్రబాబు, లోకేష్ అవమానిస్తే వారితో పొత్తు పెట్టుకోవడం కోసం ఇంటికి వెళ్లి మంతనాలు చేసి, మీ తల్లిని అవమానించిన మీరు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు, పవన్ ఎవరికీ కూడా జగన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు.. ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్‌లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు -
చైనాను బూచిగా చూపుతున్నాయి!
బీజింగ్: ప్రపంచంలోని కొన్ని దేశాలు చైనాను బూచిగా చూపుతూ ప్రత్యేక కూటములుగా ఏర్పడుతున్నాయని, కానీ ఈ ప్రయత్నాలన్నీ చివరకు విఫలమయ్యేవేనని చైనా విమర్శించింది. ఇండోపసిఫిక్ ప్రాంత పరిరక్షణకు భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కూటమిగా జట్టుకట్టిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ కూటమి నేతలు సమావేశమై స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ప్రతినబూనారు. ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తూ, దీనిపై పట్టుకు యత్నిస్తోంది. తనకు పోటీగా జట్టుకట్టిన క్వాడ్ కూటమిపై చైనా పరోక్ష విమర్శలు గుప్పించింది. చదవండి: (భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా) క్వాడ్ సమావేశాన్ని గమనించామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా ప్రతినిధి హువా చునైంగ్ చెప్పారు. కొన్నాళ్లుగా కొన్ని దేశాలు చైనాపై దాడికి తహతహలాడుతున్నాయని ఆరోపించారు. నిబంధనల ఆధారిత నియతి పేరుతో చైనాను బూచిగా చూపే యత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచ శాంతికి చైనా పాటుపడుతోందని, ప్రపంచాభివృద్ధికి చైనా అభివృద్ధి కీలకమని మర్చిపోవద్దన్నారు. అంతర్జాతీయ నియతిని తామేమీ ఉల్లంఘించడంలేదన్నారు. ఐరాస నిర్ధారిత నియమాలను, చట్టాలను చైనా గౌరవిస్తోందని తెలిపారు. చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో) నిబంధనలు కొన్ని దేశాలు మాత్రమే రూపొందిస్తాయని తాము భావించడం లేదని, అమెరికా మాత్రం తాను నిర్దేశించే నియమాల ప్రకారం ప్రపంచం నడవాలని భావిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా, కొన్ని దేశాలు కలిసి ఇలా సొంత నిబంధనలు ఏర్పరిచి ఏదో సాధిస్తామంటే చివరకు ఏమీ జరగదని, అవన్నీ విఫలమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రచ్ఛన్న యుద్ధంనాటి ఆలోచనల నుంచి ఆయా దేశాలు బయటకురావాలన్నారు. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!) -
తలలేని సీఎం మనకెందుకు?
లింగంపేట (ఎల్లారెడ్డి): దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటిచ్చారని, వీటిలో ఏ ఒక్కటైనా ఆయన అమలు చేశారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మాట తప్పుడు, మడమ తిప్పుడు కేసీఆర్‌కు పడదని, మాటతప్పితే తల నరుక్కుంటానని చెప్పిన సీఎంకు ఇప్పుడు తల ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. అందుకే తలకాయ లేని సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలని సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం బండి సంజయ్ కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అటవీ అధికారులు పాకిస్తాన్, అమెరికా నుంచి రాలేదని, అటవీ, రెవెన్యూ శాఖలతో మాట్లాడి పోడుభూముల సమస్యను పరిష్కంచవచ్చని సూచించారు. ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, తానెప్పుడూ ఇస్లాం మతాన్ని కించపరలేదని ఆయన తెలిపారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ఏమీ చేయడంలేదని ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు ఒక వంద పడకల ఆస్పత్రి అని చెప్పి ఇప్పుడు జిల్లాకు వంద మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ
సాక్షి, మహబూబాబాద్ /వరంగల్ /కమలాపూర్: నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకు కావాల్సిన నిధుల కేటాయింపు బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ప్రజాఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్ర వారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్య టించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, తొర్రూరుల్లో, తర్వాత వరంగల్, వర్ధన్నపేట, జనగామలో యాత్ర సాగింది. శుక్రవారం రాత్రి హను మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల నుంచి కమలాపూర్ వరకు యాత్ర నిర్వహించారు. ఆయాచోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా హుజూరాబాద్‌లో కమలం పువ్వు గుర్తు జెండాయే ఎగురుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల పేరిట సీఎం కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాన్ని రాజకీయ అంగడి చేసి ప్రజాప్రతినిధులు, నాయకులను పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. ఇక్కడ ఈటలను గెలిపిస్తే 2023లో తెలంగాణలో తాను బీజేపీ ప్రభుత్వాన్ని తెస్తానన్నారు. ఈ ఎన్నిక ఒక్క ఈటలది కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును తన పం తాలు, పట్టింపుల కోసం అప్పనంగా ఖర్చు చేస్తున్న సీఎంకుS తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. డిసెంబర్ నాటికి ప్రజలందరికీ వ్యాక్సిన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కష్టకాలంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని కిషన్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ అందజేయాలన్నదే కేంద్ర సర్కారు ధ్యేయమని తెలిపారు. కరోనా దృష్ట్యా దేశంలోని సుమారు 80 కోట్ల కుటుంబాలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రన్‌వేకు భూములు సమకూర్చాలి ప్రధాని మోదీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందువల్లే ములుగు జిల్లాలోని రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి చెప్పారు. కళ లకు ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు పర్యాటక పరంగా అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాల నుంచి పర్యాటకులు రావాల్సి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారో.. ఫామ్ హౌస్‌లో ఉన్నారో తెలియదని, మామునూరు విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి భూములను సమకూర్చి అభివృద్ధి చేస్తే విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో, వెయ్యిస్తంభాల గుడిలో కిషన్‌రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు, కొండేటి శ్రీధర్, రావు పద్మ, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, విజయ రామారావు, చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
Kishan Reddy: కుర్చీ కోసం.. కొడుకు కోసమే
కోదాడ, సూర్యాపేట అర్బన్: ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అమరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగించేందుకు ఆరాట పడాల్సిన కేసీఆర్.. తన కుర్చీని కాపాడుకోవడం కోసం, తన కొడుకుని సీఎంను చేయడానికి మాత్రమే ఆరాట పడుతున్నారని ఆరోపిం చారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండ గూడెం నుంచి కేంద్రమంత్రి ప్రజా ఆశీర్వాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. (చదవండి: ఎన్నాళ్లీ లాఠీ దెబ్బలు.. తెగించి కొట్లాడదాం) కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారు ప్రజా సమస్యలపై స్పందించడానికి ప్రగతి భవన్ దాటి బయటకు రాని సీఎం.. ప్రధానిని విమర్శించడానికే ముందుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారని, తెలంగాణను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినెట్లో 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని తెలి పారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి పదవులు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాలకు పేరు మార్చి అవి తమ ఘనతే అని చెప్పుకోవడం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. 2023 ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలంగాణలో నిజాంను మించిన నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 2023లో జరిగే ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్‌హస్‌కు పరిమితం చేయాలనిక కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులను బానిసల మాదిరి చూస్తున్నారని, ఆత్మగౌరవం ఉన్న వారు ఆయన వద్ద ఉండలేరని విమర్శించారు. అందుకే ఈటల రాజేందర్ బయటకు వచ్చారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాజేందర్ విజయాన్ని ఆపలేరన్నారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్లే 130 కోట్ల జనాభా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే దాదాపు 56 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయించగలిగామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించి వారీ ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధాని చేసిన సూచన మేరకే ఈ యాత్రను చేపట్టినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
బానిస మనస్తత్వానికి సూచిక
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక కోసం చేస్తున్న ఏర్పాట్లపై శివసేన మండిపడింది. ఆత్రుతగా ఎదురుచూస్తూ ఏర్పాట్లు చేయడం.. భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబి స్తోందని వ్యాఖ్యానించింది. ట్రంప్ రాక.. ‘బాద్షా’ (మహారాజు) పర్యటన లాగా ఉందని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. అహ్మదాబాద్‌లో ట్రంప్ పర్యటించనున్న మార్గంలో మురికి వాడలు కన్పించకుండా గోడ కట్టడంపైనా తీవ్ర విమర్శలు చేసింది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా రూపాయి విలువ పెరగదని, మురికి వాడల్లో ఉండే వారి జీవితాలేమీ మెరుగు పడవని పేర్కొంది. ‘స్వాతంత్య్రానికి పూర్వం.. బ్రిటిష్ రాజు లేదా రాజు తమ బానిసత్వపు దేశాల్లో పర్యటించి నప్పుడు ఇలాగే ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అచ్చు అలాగే ప్రజల పన్నుల సొమ్ముతో ట్రంప్ పర్యటన కోసం మెరుగులు దిద్దుతున్నారు. ఇది భారతీయుల బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది’అని పేర్కొంది. -
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అంతంతే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన నిధులు పూర్తి నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల పట్ల కేంద్రం ఉదారపూర్వకంగా ఉండాలని, నిజమైన పని రాష్ట్రాల్లోనే జరగుతుందని, అందుకు రాష్ట్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక విడత బకాయి లు విడుదల చేశారని, త్వరలో మిగతా విడత బకాయిలు విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమకు హక్కుగా రావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ 2.7 లక్షల కోట్లు చెల్లిస్తే.. తెలంగాణకు కేంద్రం 1.15 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. -
బీజేపీపై శివసేన విమర్శలు
-
కాంగ్రెస్ ఓ ముసలి నక్క: కర్నె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఓ ముసలి నక్క అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎడారిగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పదవుల కోసం జరుగుతున్న రాజకీయ యాత్ర అని దుయ్యబట్టారు. పచ్చి అబద్ధాలతో ఇప్పటి దాకా గాంధీభవన్‌కే పరిమితమైన కామెడీ షోలను ప్రజల ముందు ప్రదర్శించడానికి వెళ్తున్నారని, ఇలాంటి అబద్ధాలను, కాంగ్రెస్ నేతల ముసలి నక్క వేషాలను ప్రజలను నమ్మరని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరివ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నామని చెప్పుకునేందుకు ప్రజల దగ్గరికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల యాత్రలతో ప్రజలకు ఒరిగిదేమీ లేదని వెల్లడించారు. -
రాజ్యాంగంపై బీజేపీ దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ దాడికి పాల్పడుతోందని, రాజకీయ లబ్ధి కోసం అసత్యాల్ని ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని సవరించాలన్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలు భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైనవి. చివరికి ఆ రాజ్యాంగంపై కూడా దాడి చేస్తున్నారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగం, అంబేడ్కర్ మనకిచ్చిన రాజ్యాంగంపై దాడి బాధ కలిగిస్తోంది. వెనుక నుంచి దొంగతనంగా దాడి చేస్తున్నారు. అయితే రాజ్యాంగాన్ని, ప్రతీ వ్యక్తికున్న హక్కులు, అభిప్రాయాల్ని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీదే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత’ అని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం అసత్య ప్రచారం అసత్యాలతో బీజేపీ మోసపూరిత వలను అల్లుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా, ఎన్నికల్లో ఓడినా సరే సత్య మార్గాన్ని వదిలిపెట్టబోదని, దానిని పరిరక్షిస్తూనే ఉంటుందని చెప్పారు. సత్యమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య సిద్ధాంతమని.. దానిని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత విజయాలను ప్రస్తావించిన రాహుల్.. శతాబ్దానికి పైగా కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆయన గురువారం అక్బర్ రోడ్డులోని కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
రాజకీయ కోణంలోనే తెలుగు సభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను భాషాభివృద్ధికోసం కాకుండా రాజకీయకోణంలో నిర్వహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జీవన్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టుల విధానమే తన విధానమన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఒరిగేదేం లేదు..ప్రపంచ తెలుగు మహాసభలపై డీకే అరుణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురించి గొప్పలు చెప్పించుకోవడానికే రూ. కోట్ల నిధులు వెచ్చించి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో 4 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడే తెలంగాణ ఇచ్చారు సోనియా పార్టీ ఖ్యాతిని నిలబెట్టారు: సీఎల్పీనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల హృదయ ఘోషను అర్థం చేసుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన ఉద్యమానికి భయపడి, విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, గుండెకోతను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని జానారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాలపాటు సేవలందించిన సోనియా, పార్టీ ఖ్యాతిని నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నందున తాను ప్రపంచ తెలుగు సభలకు హాజరుకాలేక పోతున్నానని చెప్పారు. వ్యక్తిగత రాగద్వేషాలను, మనస్పర్థలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు మహాసభలకు అందరు కవులు, కళాకారులను ఆహ్వానించాలని జానారెడ్డి సూచించారు. అందెశ్రీ వంటివారిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. -
‘ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్ లో కూర్చొని పీసీ సీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నార ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశారని, పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అప్పుడు ఎందుకు పెంచలేదని నిలదీశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, ఆదివాసీల ఉద్యమం వెనుక ఉన్న సోయం బాబూరావు, ఆత్రం సక్కు వంటి వారు ఏ పార్టీకి చెందినవారో అందరికీ తెలుసునని రాములు నాయక్ అన్నారు. నాయీల వృత్తి నైపుణ్యానికి రూ.250 కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అత్యాధునిక శిక్షణ అవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాయీ బ్రాహ్మణుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కుల వృత్తిదారులు రాణించాలంటే పరిస్థితులకు అనుగుణంగా వృత్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. -
ఔరంగజేబు పాలన వద్దు!
ధర్మపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికను మొఘల్ పాలకుల వారసత్వ పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. మాకు ఔరంగజేబు పాలన వద్దంటూ పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తోందని తప్పుపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి బురదలో కూరుకుపోయాయని.. అయితే తన నేతృత్వంలో గుజరాత్లో, కేంద్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ‘బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడానికి రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగ్గు వదిలేసింది. అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ.. దివాలాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది’ అని వల్సాద్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలు, వారి భవిష్యత్తు నాయకుల శక్తి సామర్థ్యాలు ఈ నిర్ణయంతోనే మనకు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవాచేశారు. ‘మొఘలుల పాలనలో ఎన్నికలు జరిగాయా? జహంగీర్ తర్వాత షాజహాన్ వచ్చాడు. అప్పుడు ఎన్నికలు జరిగాయా? షాజహాన్ తర్వాత ఔరంగజేబు అనేది అందరికీ తెలుసు’ అని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు చేశారు. ‘ఏక కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా..? మాకు ఈ ఔరంగజేబు పాలన వద్దు.. మాకు దేశమే ముఖ్యం. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే మా హైకమాండ్’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘గుజరాత్లో బీజేపీని ఓడించగలిగితే.. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తమ మాట వింటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది.అయితే అందుకు మీరు అనుమతిస్తారా? గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని మీరు అడ్డుకుంటారా?’ అని మోదీ ప్రశ్నించగా.. లేదు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ప్రచారంలో రాహుల్ తరచూ దేవాలయాల సందర్శనపై మోదీ విమర్శలు కురిపించారు. ‘ఇంతకుముందు.. లౌకిక వాదులుగా చెప్పుకునేందుకు వారు పోటీ పడేవారు. తాను లౌకిక వాదినని ఒకరు చెబితే, మరొకరు తాను నాలుగు కిలోలు ఎక్కువ లౌకిక వాదినని, మూడో వ్యక్తి ఆరు కిలోల ఎక్కువ లౌకికవాదినని చెప్పుకునేవారు. గుజరాత్ ఎన్నికలకు ముందు ఆ పోటీ ఏమైంది. హిందూ ఓట్ల కోసమే వారు ఆలయాల్ని సందర్శిస్తున్నారని ప్రజలు గ్రహించగలరు’ అని ప్రధాని చెప్పారు. -
ఓట్లడిగే పద్ధతి ఇది కాదు
సూరత్: ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవటంలో విఫలమైన మోదీ ప్రజల్లోకి ఎలా వెళతారన్నారు. ఓట్లడిగేటప్పుడు గౌరవప్రదమైన విధానాన్ని ఎంచుకోవాలన్నారు. నోట్ల రద్దును అకస్మాత్తుగా, సన్నద్ధం కాకుండానే చేసిన యుద్ధంగా అభివర్ణించారు. ఈ కారణంగానే సొంత రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు నిలయమైన సూరత్‌లో నేతన్నలు 89 వేల మరమగ్గాలను తెగనమ్ముకున్నారని, 31వేల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. నల్లధనం వెలికితీసేందుకు చేపట్టిన నోట్లరద్దుతో ప్రభుత్వం సామాన్యుడిని కూడా దొంగలా చూస్తోందన్నారు. జీఎస్టీ భయంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవర్గాలు జంకుతున్నాయన్నారు. తనను కలిసిన కొందరు వ్యాపారవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు షాక్ నుంచి ప్రజలు తేరుకోకమునుపే ప్రధానమంత్రి జీఎస్టీని తీసుకువచ్చారని అన్నారు. దీనికోసం ఎవరినైనా సంప్రదించటం కానీ, సమస్యను అర్థం చేసుకోవటంగానీ లేకుండా మోదీ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. -
మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్
-
మాటకు - మాట
-
'కాళేశ్వరం ఎత్తిపోతలపై దుష్ర్పచారం'
-
హైదరాబాద్‌పై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నం !
హైదరాబాద్: హైదరాబాద్‌పై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నించే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన చట్ట సవరణపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని పొన్నం ప్రభాకర్.... టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. విభజన చట్టం, కేంద్రంతో సంబంధాలు వంటి అంశాలలో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను సంప్రదించి విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రానికి ఈ సందర్భంగా పొన్నం విజ్ఞప్తి చేశారు. ఏపీ కౌన్సిల్ సభ్యుల సంఖ్య పెంపునకు విభజన చట్టసవరణ పరిమితం అవుతుందని అనుకోలేమని పొన్నం ప్రభాకర్ తెలిపారు.