విశాఖపట్నం: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన మహిళా ద్రోహి చంద్రబాబని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులకు పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు కాదా?. చంద్రబాబు పాలనలో మహిళా అధికారి వనజాక్షిని దారుణంగా కొట్టారని, దళిత మహిళలను వివస్త్రతను చేసి దాడులు చేశారని ధ్వజమెత్తారు. పవన్, చంద్రబాబు మాటలను చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు.
చంద్రబాబు కుటుబంలో వాలంటీర్లు ఏమైనా గొడవలు పెట్టారా..? అని ప్రశ‍్నించారు. చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? అని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా..? అంటూ ఎద్దేవా చేశారు.
లోకేష్‌తో గొడవ పడి చంద్రబాబు పామ్ హౌస్‌లో కాపురం ఉండడానికి వాలంటరీలు కారణమా..? మహిళల పట్ల గౌరవం లేని సంస్కారహీనుడు పవన్ కళ్యాణ్ అంటూ దుయ్యబట్టారు. పవన్ తల్లిని చంద్రబాబు లోకేష్ దారుణంగా అవమానించారు అయినప్పటికీ సిగ్గు లేకుండా అదే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు.
వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1.పరిపాలనలో విప్లవాన్ని తీసుకొచ్చారు
గత నాలుగేళ్లుగా సీఎం జగన్ గారు సరికొత్త ఆలోచనలతో, నూతన సంస్కరణలతో పరిపాలనలో విప్లవాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్.. మా భవిష్యత్ నువ్వే జగనన్న అంటున్నారు. ఏ జాతీయ మీడియా సర్వేలు చూసినా... వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వస్తున్నాయి.
2. గ్రామ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం
దేశానికే ఆదర్శమైన గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా పథకాలు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. అలాగే పథకాల అమలులో ఒక్క శాతం లబ్ధిదారుడు కూడా మిగిలిపోకూడదని జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే గొప్ప పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ గారికి ప్రలజందరూ నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల్లో అయితే జగన్ గారి ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంతగా పెరిగింది..
- మహిళల్లో, ప్రజల్లో జగన్ గారి ఇమేజ్ ను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ ఫ్రస్టేషన్ కి లోనై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎల్లోమీడియా రేటింగ్స్, చంద్రబాబు ట్రైనింగ్, పవన్ కల్యాణ్ ప్రాంప్టింగ్.. ముగ్గురు కలిపి జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు
3. అది మహాశక్తి కాదు మాయాశక్తి...
చంద్రబాబు మహిళల కోసం ఏర్పాటు చేసిన మహాశక్తి కార్యక్రామాన్ని చూసి మహిళలు నవ్వుకుంటున్నారు. మహిళా ద్రోహి అయిన చంద్రబాబు మహిళోద్దారకుడిలా బిల్డప్ లు ఇస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
మహిళల్ని నిట్టనిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. మహిళల పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చే ముందు రూ.14,500కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తివేసిన మహిళా ద్రోహి చంద్రబాబు. మహిళలు చదువుకోకుండా అడ్డుకోవడానికి.. ఫీజు రీయింబర్స్ మెంట్ లో కోతలు విధించిన వ్యక్తి చంద్రబాబు.
చంద్రబాబు పాలనలో అడుగడుగునా మహిళలకు రక్షణ లేదు... రిషితేశ్వరి విషయంలో కాంప్రమైజ్ చేయడానికి యత్నించిన వ్యక్తి చంద్రబాబు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చికోడితే సపోర్ట్ చేసిన వ్యక్తి, మహిళా ద్రోహి చంద్రబాబు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో కొన్ని వేల మంది మహిళలు ఎంతో ఇబ్బందిపడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ కు కారణమైన వారికి మద్దతిచ్చిన మహిళా ద్రోహి చంద్రబాబు. దళిత మహిళను కాలితో తన్ని అవమానపర్చిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి చంద్రబాబు మహిళలను ఉద్ధరిస్తాడంటే నమ్ముతారా..?
4. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు...
డీబీటీ ద్వారా పారదర్శకంగా, ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి తావులేకుండా రూ.2,26,000కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించారు. దీనిలో కూడా 75శాతం పథకాలు మహిళలకే అందిస్తున్నారు.. మహిళలకు అనునిత్యం అండదండగా నిలబడిన సీఎం జగన్ గారిని మహిళా ద్రోహి అని చంద్రబాబు అనే సైకో అంటున్నాడు.
సైకో ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు..! సైకో ఎవరో సొంత మామైన ఎన్టీఆరే చెప్పారు. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు అని ఎవర్ని అడిగినా చెబుతారు.. టీడీపీ గుర్తు సైకిల్.. టీడీపీ పాలన సైకో పాలన.. అలాంటి చంద్రబాబు జగన్ గారిని విమర్శిస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు, సీఎం జగనన్న పాలన పోల్చి చూస్తే నక్కకు నాకలోకానికి ఉన్నంతా తేడా ఉంది
మహిళా ద్రోహి అయిన చంద్రబాబు పాలన మహిళా కక్షపాత పాలన.. జగన్ గారి పాలన మహిళా పక్షపాత పాలన..
చంద్రబాబు పాలన అనకొండ పాలన.. జగనన్న పాలన మహిళలకు అండగా ఉండే పాలన...
చంద్రబాబు పాలన అరాచక పాలన అయితే.. జగనన్న పాలన మహిళల్ని ఆదరించే పాలన...
చంద్రబాబు పాలన నారా-నరకాసురుల పాలన అయితే.. జగనన్న పాలన నవశకం పాలన...
చంద్రబాబు పాలన దుశ్శాసన పాలన అయితే జగనన్న పాలన మనస్సుని టచ్ చేసే పాలన. మనసున్న గొప్ప ముఖ్యమంత్రి జగనన్న.
5. ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబంలో గొడవలు సృష్టించారు బాబూ..?
- వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని దారుణంగా, నీచంగా మాట్లాడుతున్నారు.
- 75 ఏళ్ల వయసు, 44ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు వాలంటీర్లను ఉద్ధేశించి ఆ విధంగా మాట్లాడవచ్చా? వాలంటీర్లు కుటుంబాల్లో గొడవలు సృష్టిస్తున్నారు అని మాట్లాడుతున్నారే.. ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబంలో గొడవలు సృష్టించారు చంద్రబాబు... ? కుటుంబాల్లో గొడవలు సృష్టించడం, సొంత మామని వెన్నుపోటు పొడవడం, సొంత భార్యను అడ్డంపెట్టుకుని మామను గద్దెదించి సీఎం అవడం.. ఇలాంటి పనులు మన రాష్ట్రంలో చేసేది మీరే.. వాలంటీర్లు కాదు.
- కోవిడ్ సమయంలో మీరు. మీ కొడుకు లోకేష్ గొడవులు పడ్డారని.. మీ భార్య భువనేశ్వరి, మీ కోడలు బ్రాహ్మణి గొడవలు పడ్దారని.. అలిగి మీరు, మీ భార్య ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని ప్రజలందరూ అనుకున్నారు.. ఈ గొడవలన్నీ ఏ వాలంటీర్ పెట్టారు చంద్రబాబు.? ఈ గొడవలు ఏ వాలంటీర్ పెట్టలేదు కదా..?
- వాలంటీర్లను చులకన చేసి, అవమానించి మాట్లాడిన చంద్రబాబు వాలంటీర్లకు, ముఖ్యంగా మహిళా వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..
6. ప్రతి ఇంటికి చందమామను తెచ్చి ఇస్తాను అంటాడు..
- నిన్న టీడీపీ మహాశక్తి కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి, రాష్ట్రంలో ప్రతి ఇంటికి చందమామను తెచ్చి ఇస్తాను అని మాయమాటలు చెప్పే విధంగా ఉన్నాయి
- అది మహాశక్తి మీటింగ్ కాదు మాయాశక్తి మీటింగ్.. వారిది తెలుగు మహిళా విభాగం కాదు తెలుగు మహిళల పాలిట దగా విభాగం.. తెలుగు మహిళా ద్రోహుల పార్టీ.. టీడీపీ అని మహిళలందరూ భావిస్తున్నారు..
7. టీడీపీ మేనిఫెస్టో ఔట్ డేటెడ్ ప్రొడక్ట్.. వారంటీ లేని ప్రొడక్ట్..
జగనన్న ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడితే కానీ మీ మేనిఫెస్టో తయారుకాలేదు. అలాంటి మీకు మా జగనన్న పథకాలను కామెంట్ చేసే అర్హత లేదు.
-జగనన్న పథకాలకు అత్తరు పూసి, జగనన్న ఆలోచనలకు రంగులు అద్ది, జగనన్న పాలసీలకు పౌడర్ పూసి మీ మేనిఫెస్టో తయారు చేశారు.. అటువంటి మీ మేనిఫెస్టో ఔట్ డేటెడ్ ప్రొడక్ట్.. వారంటీ లేని ప్రొడక్ట్. ఔట్ డేట్ అయిన ప్రొడక్ట్ ను చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ప్రజలు మళ్లీ మీకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు..
-మీరు చెప్పే మాటలు కసాయి వాడు వెళ్లి మేకలకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తాను అనేలా ఉన్నాయి.. మూడుసార్లు సీఎంగా చేసి మీరు అమలు చేయని పథకాలు ఈరోజు చేస్తానని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకు, మహిళలకు లేదు.
14 ఏళ్లు సీఎంగా ఉండి.. రాష్ట్రంలో తల్లులకు పంగనామం అనే పథకం చంద్రబాబు అమలు చేశారు. మళ్లీ ఈరోజు తల్లికి వందనం.. అంటూ మభ్యపెట్టడానికి కొత్త పథకం అంటున్నారు.. మిమ్మల్ని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ గారు అమ్మఒడి పథకం ద్వారా 44లక్షల మంది మహిళలకు రూ.26వేల కోట్లు ఇవ్వడం జరిగింది. ఆసరా పథకం ద్వారాం 80లక్షల మందికి రూ.25వేల కోట్లు ఇవ్వడం జరిగింది. చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మహిళలను ఆదుకుంటున్నారు. 31లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది.. మీ 14ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టారా? చంద్రబాబు. 31లక్షల ఇళ్ల మాట దేవుడెరుగు.. కనీసం 3లక్షల ఇళ్లు అయినా ఇచ్చారా? అమ్మఒడి లాంటి పథకం మీ 14ఏళ్ల పాలనలో కనీసం 14 మందికి ఇచ్చారా.. ?
-14 ఏళ్ల పాలనలో ప్రజలకు రూపాయి కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు ఏదో చేసేస్తాను అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.. మహిళలు ఏమీ చెవిలో పూలు పెట్టుకోలేదు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి, మీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తీసేసిన వ్యక్తి చంద్రబాబు.. మళ్లీ అబద్దాపు హామీలతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు..
8. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ జగనన్న..
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి 99శాతం అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మా జగనన్న.. జగనన్న ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. మహిళలు కూడా జగనన్న మీద ఎంతో అనుబంధాన్ని చూపిస్తూ.. అనుబంధానికి బ్రాండ్ అంబాసిడర్ లుగా మహిళలు ఉన్నారు
మహిళా సాధికారితకు ఉదాహరణ జగనన్న పరిపాలన అయితే.. మహిళా ద్రోహానికి బెస్ట్ ఉదాహరణ చంద్రబాబు పాలన... దుర్మార్గమైన పాలన అందించిన మిమ్మల్ని, ఈరోజు మీ కాకమ్మ కబుర్లని ప్రజలు నమ్మరు..
9. మీ గెజిట్ ఈనాడులోనే "జన్మభూమిలో నేతల మేత" అని ఫస్ట్ పేజీలో రాశారు..
వాలంటీర్ల మీద బురదజల్లితే తిరిగి మీమీదే పడుతుంది. టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనిత మాటలు, భాష చూసి మహిళలందరూ సిగ్గుపడుతున్నారు.. ఆడవారిని వాలంటీర్లు లోబర్చుకుంటున్నారని అనడానికి సిగ్గులేదా? మీ ప్రభుత్వంలో పథకాలు కోసం కాళ్లు అరిగేటట్టుగా తిరిగేవారు.. ఈరోజు పేద ప్రజల గడప దగ్గరకి వెళ్లి వాలంటీర్లు పథకాలు అందిస్తుంటే.. ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుగా లేదా? పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది..
గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన చెత్త పనులే.. వాలంటీర్లు చేస్తున్నారని అనిత మాట్లాడుతున్నారేమో..
జన్మభూమి కమిటీలు అవినీతికి మారుపేరు.. జన్మభూమి కమిటీల చిట్టా చూస్తే.. మీ ప్రభుత్వంలో, మీ పార్టీ గెజిట్ అయిన ఈనాడు పత్రికలో 2017 ఆగస్టు 11న "జన్మభూమిలో నేతల మేత" అని ఫస్ట్ పేజీలో రాశారు.. "జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసినవారే పథకాలకు అర్హులు, గ్రామసభలు ఉండవు, రుణాలకు లంచాల రేట్లు, జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం, ఎక్కడ చూసినా లంచం.. లంచం.. లంచం.. పింఛన్ కు రూ.3వేల నుంచి 5వేల లంచం, రుణం కావాలంటే రూ.10వేలు లంచం, ఇల్లు మంజూరు కావాలంటే రూ.15వేలు, కార్పొరేషన్ నుంచి రుణం పొందాలంటే రూ.25 వేల నుంచి 37వేల లంచం ఇవ్వాలి, మరుగుదొడ్డు మంజూరు కావాలంటే రూ.1500 ఇవ్వాలి.. ఎన్టీఆర్ గృహ పథకం రూ.20వేలు లంచం.." అని మీ గెజిట్ ఈనాడులో రాశారు.. ఇది మీ జన్మభూమి కమిటీల తాలుకా అరాచక చరిత్ర..
జన్మభూమి కమిటీలకు, వాలంటీర్లకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దగ్గర చులకన అవుతారే తప్ప సాధించేంది ఏమీ లేదు
10. నారాహి యాత్రలో ఊగిపోతున్న పవన్..
-వారాహి అని నారాహి యాత్ర చేస్తు.. పవన్ ఊగిపోతూ, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. వాలంటీర్లు మహిళ అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాలంటీర్లలో 70శాతం ఉన్న మహిళలు.. మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే మీకు మహిళలు అంటే ఎంత గౌరవమో అర్థం అవుతుంది..
- జగనన్న వలన మహిళలు రాజకీయాల్లోకి రావట్లేదని అనడానికి నోరు ఎలా వచ్చింది పవన్ కల్యాణ్.. జగనన్న ఏర్పాటు చేసిన ఏ సమావేశ వేదిక మీద మహిళలు ఎంతమంది ఉంటున్నారు.. మీ మీటింగ్ లలో ఎంతమంది మహిళలు ఉంటున్నారు.? మీ వారాహి రథం మీద ఒక్క మహిళా ఉందా? మా జగనన్న మీటింగ్స్ లలో 50శాతం పైగా మహిళలు కనిపిస్తారు..
-జగనన్న నలుగురు మహిళలకు మంత్రి పదవులతో పాటు, మండలి డిప్యూటీ ఛైర్మన్ మహిళకు అవకాశం ఇచ్చారు, ఎంతోమంది మహిళలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు.. 50శాతం పైగా నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు.. 50శాతానికి పైగా మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు , కార్పొరేషన్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్లన్లు గా మహిళలు ఉన్నారు.. మహిళలను ఎంతగానో గౌరవిస్తూ, ఆదరిస్తున్న ఏకైక వ్యక్తి జగన్ గారు.. మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతస్థానాల్లో కూర్చొపెట్టడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. దిశచట్టం, దిశయాప్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు
- జగనన్న పాలనలో ఇంట్లో ఉన్న మహిళలు కూడా రాజకీయాల్లోకి ధైర్యంగా వచ్చి తిరుగుతున్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా, మహిళలకు రాజ్యాంగం కల్పించిన పదవుల కంటే ఎక్కువ పదవులు ఇచ్చారు.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలివారు వరకు పథకాలు మహిళలకు అందుతున్నాయి. రాష్ట్రంలోని మహిళలు అంతా నమ్మేది కూడా జగన్ గారినే.. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చిప్రేలేపనలు మాట్లాడితే ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో గడ్డి తినిపించి, బుద్ది చెప్పి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు
11. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది.. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు.. రాష్ట్రంలో ఉన్న మహిళలందర్ని సొంత తల్లి, చెల్లిని ఏ విధంగా గౌరవిస్తారో అదే విధంగా, ఎంతో ఆప్యాయయంగా పలకరిస్తూ గౌరవిస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు పొందే అంత గొప్పగా భారతమ్మ పిల్లల్ని పెంచారు.
- జగన్ గారి సభల్లో ఎక్కడైనా.. మీ భార్య పిల్లల్ని గానీ ఒక్క మాట అన్నారా? పవన్.. మీరు మా ప్రభుత్వంలోని మహిళల్ని, ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని పేరు పెట్టి కించపరుస్తూ, అవమానిస్తూ మాట్లాడారు.. జగనన్న ఏనాడు అలా చేయలేదు.. కాబట్టి జగన్ గారిని చూసి సంస్కారం నేర్చుకుంటే బాగుంటుంది పవన్ కల్యాణ్.. భారతమ్మగారి పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు..
మీ తల్లిని చంద్రబాబు, లోకేష్ అవమానిస్తే వారితో పొత్తు పెట్టుకోవడం కోసం ఇంటికి వెళ్లి మంతనాలు చేసి, మీ తల్లిని అవమానించిన మీరు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు, పవన్ ఎవరికీ కూడా జగన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు..
ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్‌లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment