ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పెదవి విప్పని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి ఇపుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో బుధవారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టవద్దనేదే వీరి లక్ష్యమని విమర్శించారు.