pranahitha chevella project
-
'కాళేశ్వరం ఎత్తిపోతలపై దుష్ర్పచారం'
-
‘ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దు’
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ప్రయోజనాలను ఆశించి.. ఎంతో ఆలోచించి మొదలు పెట్టిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారని, ఈ ప్రాజెక్టు డిజైన్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా వచ్చే అవకాశం ఉన్నందున, డిజైన్ మార్చకుండా పాత డిజైన్‌తోనే పనులు చేపట్టాలని, లేనట్టయితే ఇప్పటికే ఖర్చు చేసిన వేల కోట్లు వృథా అవుతాయని అభిప్రాయపడ్డారు. -
‘మధ్యమానేరు’కు కదలిక
ఆగిన ప్రాజెక్టుకు పరుగులు సీఎం సమీక్షలో నిర్ణయం {పాణహిత-చేవెళ్లతో లింక్ సాగు, తాగునీటికి కొత్త ఆశలు అర్ధంతరంగా ఆగిన మధ్యమానేరు ప్రాజెక్టుకు ప్రాణం పోసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మిడ్‌మానేరు వరకు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో మిడ్‌మానేరు ప్రాజెక్టుపై కొత్త ఆశలు చిగురించాయి. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వటంతో అందులో అంతర్భాగమైన మిడ్ మానేరుకు జవజీవం పోసినట్లయింది. నత్తనడకన సాగుతున్న పనులు వేగం పుంజుకోనున్నాయి. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయుజ్ఞంలో భాగంగా జిల్లాలో మిడ్ మానేరు ప్రాజెక్టును తలపెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల గిమ్మిక్కులతో ఈ జలాశయు నిర్మాణం పునాదుల్లోనే ఆగిపోయింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 18 మండలాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. దీంతో సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాలు, 157 గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్య తీరిపోనుంది. బోయినపల్లి మండ లం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 2006లో మిడ్‌మానేరు జలాశయానికి అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు. మొదటిసారి రూ.339.39 కోట్లకే పనులు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ అడ్వాన్సులు తీసుకొని చేతులెత్తేసింది. నిదానంగా తేరుకున్న సర్కారు నాలుగేళ్ల తర్వాత రూ.454 కోట్ల అంచనాలతో మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్‌కు రూ.360.90 కోట్లకు ఎంఎస్ ఎస్ఏపీఎల్, అండ్ ఎంబీఎల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జాయింట్ వెంచర్లో పనులు దక్కించుకున్నారుు. 2012 ఏప్రిల్ 23న మంత్రులు శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి రెండో దఫా పనులను ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2015 ఏప్రిల్ నాటికి రిజర్వాయుర్ నిర్మాణం పూర్తి కావాలి. కానీ.. ఇప్పటికీ 20 శాతం పనులు పూర్తి కాలేదు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ పరిసరాల్లో స్పిల్‌వే నిర్మాణంలో ఉంది. రిజర్వాయుర్కు 25 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా క్రాస్ రెగ్యులేటర్లు, రెండు తూము లు నిర్మించాల్సి ఉంది. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లె వద్ద కట్ట నిర్మాణం జరిగింది. మానేరు అవతలి వైపు ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లె, సిరిసిల్ల మం డలం చీర్లవంచ వైపు కట్ట నిర్మించారు. ప్రధాన కట్ట నిర్మాణం కొంత మేరకు పూర్తికాగా.. రాతి కట్టడాలు (రివిట్మెంట్) పూర్తి కాలేదు. కోట్ల రూపాయలతో జలాశయం చుట్టూ నిర్మిం చిన కట్టలు కనపడకుండా చెట్లు, పిచ్చిమొక్కలు, ముల్లపొదలు ఏర్పడి నిర్వీర్యమై వాటి ఆనవాల్లే కనపడడంలేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో అడుగడుగునా కట్టలకు గండ్లు పడ్డా యి. శ్రీరాంసాగర్ మిగులు జలాలను సద్వినియోగం చేసేం దుకు ఎస్సారెస్పీ నుంచి గతంలో 122 కిలోమీటర్ల పొడవున వరద కాలువ పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా వచ్చిన వరద నీటిని సైతంనిల్వ చేసేందుకు వీలుగా ఈ రిజర్వాయుర్ డిజైన్ చేశారు. జలాశయంలో ముంపునకు గురయ్యే సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ మండలంలోని అనుపురం, కొడుముంజ, రుద్రవరం, సంకెపల్లి, బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె, శాభాష్‌పల్లి గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం అసంపూర్ణంగా అందింది. నిర్వాసితుల సమస్యలతోపాటు ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యం.. నిధుల కేటాయింపు తీరును ఎండగట్టేందుకు గతంలో ఇదే రిజర్వాయర్ సమీపంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటావార్పు చేపట్టి ఆందోళన చేశారు. తాజాగా సీఎం హోదాలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రాణహిత-చేవెళ్లతో లింక్ ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నుంచి 160 టీఎంసీలు, ఎల్లంపల్లి బ్యారేజీ సమీపంలో గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని మెట్టప్రాంతాలకు మళ్లించేందుకు డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని, జంట నగరాలకు, ప్రాజెక్టు విస్తరించిన పరిధిలోని గ్రామాలకు తాగునీటిని, పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని అందించే బహుళ ప్రయోజనాలుండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టును మొత్తం ఏడు లింక్‌లుగా విభజించారు. మొదటి లింక్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మెడిహట్టి సమీపంలో నిర్మించే ప్రాణహిత బ్యారేజీ నుంచి గోదావరిఖని సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. రెండో లింక్‌లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తారు. మూడో లింక్‌లో మిడ్ మానేరు నుంచి గంభీరావుపేట సమీపంలో ఉన్న ఎగువ మానేరుకు, నాలుగో లింక్‌లో మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు వరకు ప్రాణహిత ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించటంతో.. జిల్లా పరిధిలో దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
రైతన్న గోస ఆదుకోని ‘ప్రాణహిత’
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా భావిస్తున్న ‘ప్రాణహిత-చెవేళ్ల’ ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చి ఏడాదైనా పరిహారం అందక రైతులు సతమతమవుతున్నారు. అటు పరిహారం అందక.. ఇటు ఆ భూముల్లో సాగు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. అధికారుల తప్పిదం కారణంగా బాధిత రైతులు ఏడాది కాలంగా గోసను అనుభవిస్తున్నారు. ఒకే భూమి రెవెన్యూ కార్యాలయంలో ఓ విధంగా, ల్యాండ్ రికార్డు కార్యాలయంలో మరో విధంగా నమోదై ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాదైనా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులు రోడ్డున పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క గజ్వేల్ మండలం దాతర్పల్లిలోనే 35 ఎకరాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రాణహిత ఎత్తిపోతల పథకం కోసం గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలో 87 ఎకరాల భూమిని సేకరించారు. మెరుగైన పరిహారం ఇస్తామని చెప్పి డబ్బులు ముట్టజెప్పకుండానే భూములను స్వాధీనం చేసుకున్నారు. ధర నిర్ణయం విషయంలో నెలల తరబడి జాప్యం కొనసాగింది. చివరకు ఎకరాకు రూ.4.35 లక్షల నుంచి రూ.4.79 లక్షల వరకు ధర నిర్ణయించారు. ఈ ధర ప్రకారం గ్రామంలో సేకరించిన 87 ఎకరాల్లో 52 ఎకరాలకు మాత్రమే రెండు నెలల క్రితం పరిహారాన్ని అందజేశారు. మిగిలిన 35 ఎకరాలు (సర్వే నంబర్లు 42, 129) గజ్వేల్ తహశీల్ కార్యాలయ రికార్డుల్లో పట్టాభూములుగా... ల్యాండ్ రెవెన్యూ కార్యాలయ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదై ఉంది. సదరు భూములకు సంబంధించి పరిహారం చెల్లించకుండా ఆ విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. ఇవి ఏ రకమైన భూములో తేలిన తర్వాతే పరిహారం ఇచ్చే అవకాశముండగా ఈ వ్యవహారంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఏడాది క్రితం భూములను స్వాధీన పరిచిన రైతులు పంటలు కోల్పోయి, చివరకు పరిహారం అందక అల్లాడుతున్నారు. ఇలాంటి సమస్య ఒక్క దాతర్పల్లిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఈ పథకం కోసం జిల్లా పరిధిలో 27,934 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాలను కూడా సేకరించలేకపోయారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న.. దాతర్పల్లిలోని 42 సర్వే నంబర్లో 8 ఎకరాల 36 గుంటల భూమిని ప్రాణహిత పథకం కోసం అధికారులు తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పట్టా భూమి అని ఉంటే సంగారెడ్డిలోని ల్యాండ్ రికార్డ్ కార్యాలయ రికార్డుల్లో పీపీ భూమి అని ఉందట. ఈ సాకుతో ఏడాది కాలంగా పరిహారం ఇస్తలేరు. పరిహారం ఇచ్చేదాక పంటలైనా సాగు చేద్దామంటే అధికారులు ఒప్పుకుంటలేరు. ఈ సమస్య ఎప్పుడు తెగుతదో తెలుస్తలేదు. - జూపల్లి సత్యనారాయణ, రైతు దాతర్పల్లి త్వరలోనే పరిహారం.. దాతర్పల్లి గ్రామంలో 42, 129వ సర్వే నంబర్లలో నష్టపరిహారం నిలిచిపోయింది. ఈ సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివా? పట్టా భూములా? అనేది తేలిపోగానే పరిహారం పంపిణీకి చర్యలు చేపడతాం. తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. - చంద్రమౌళి, ప్రాణహిత-చెవేళ్ల పథకం డిప్యూటీ తహశీల్దార్ -
వనరులున్నా..వీడని శని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమలో రైతన్న పరిస్థితి దైన్యం గా మారింది. జిల్లాలో జల వనరులు పుష్కలంగా ఉన్నా సాగుకు నీరందక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సిం గూరు ప్రాజెక్టు కేవలం హైదరాబాద్‌కు తాగునీరు అందించే వనరుగానే మారింది. వేలాది చె రువులు, కుంటలున్నా నిర్వహణ లోపం, వర్షాభావ పరిస్థితులు ఆయకట్టు రైతులకు శాపంగా పరిణమించాయి. ఘణపురం, నల్లవాగు వంటి మధ్య తరహా ప్రాజెక్టులున్నా కాలువల ఆధునికీకరణ లేక సాగు విస్తీర్ణం తగ్గుతోంది. 5.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు కాగితాల్లో కూడా కనిపించడం లేదు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో ఆ శాఖ అధికారుల లెక్కల ప్రకా రం 4.72 లక్షల హెక్టార్లు మాత్రమే సాగుకు యోగ్యమైనది. జిల్లా విస్తీర్ణంలో సుమారు 49 శాతం మేర సాగవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఘణపురం, నల్లవాగు ప్రాజెక్టుల కింద 11,058 హెక్టార్ల రిజిస్టర్డు ఆయకట్టు ఉండగా ఏనాడూ ఎనిమిది వేల హెక్టార్లకు మించి సాగైన దాఖలా లేదు. ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణ జరగకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం క్రమంగా పడిపోతోంది. కుంటలు, చెరువుల కింద 71,595 హెక్టార్లకు సాగు వసతి ఉన్నట్లు నీటి పారుదల శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. బావులు, గొట్టపు బావుల కింద సాగవుతున్న 1.38 లక్షల హెక్టార్లను కూడా కలిపితే జిల్లాలో మొత్తంగా 2.20 లక్షల హెక్టార్లకు మాత్రమే సాగు నీటి వసతి ఉన్నట్లుగా భావించవచ్చు. మరో 2.51 లక్షల హెక్టార్లు కేవలం వర్షాధారంగానే సాగుతోంది. ఇదిలావుంటే ఏటా ఎదురవుతోన్న వర్షాభావం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్వహణ లోపం, పెరుగుతున్న పారిశ్రామికీకరణ వంటి కారణాలతో సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతోంది. అయితే వ్యవసాయ శాఖ మాత్రం ఇ ప్పటికే 4.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు లెక్కలు చెప్తోంది. నత్తనడకన సింగూరు కాలువల పనులు.. హైదరాబాద్ నగరానికి తాగు నీటిని సరఫరా చేస్తోన్న సింగూరు ప్రాజెక్టు నుంచి 40 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కాలువల తవ్వ కం, లిఫ్ట్ పనులు మొదలు పెట్టారు. జూన్ 2012 నాటికి 12 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉన్నా పనులు పూర్తి కావడం లేదు. నిధులు లేక నీరసించిన ప్రాణహిత.. జిల్లాలో 5.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాణహిత- చేవెళ్ల పనులకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన చేశారు. నిధుల కేటాయింపు తీరు చూస్తే మరో రెండు దశాబ్దాలైనా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఘణపురం ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణకు జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ.25 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. 2014లోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత బంధువు ఒత్తిడితో పనులు నిలిచి పోయాయి. నల్లవాగుకు నాసిరకం పనులు.. నల్లవాగు కాలువ ఆధునికీకరణ కోసం రూ.14.19 కోట్లు వెచ్చించినా నాసిరకం పనులతో కేవలం రెండేళ్లలో శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతుకు రూ.100 కోట్లు ఇస్తామంటూ సీఎం కిరణ్ చేసిన ప్రకటనలు హామీలకే పరిమితమయ్యాయి. మొత్తంగా అరకొరగా వచ్చి చేరుతున్న నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దిశలో పాలకులు, అధికారులు దృష్టి సారించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా నీటి వనరుల్లో జలకళ ఉట్టిపడేలా పాలకులు శ్రద్ధ చూపుతారేమోననే ఆశ రైతాంగంలో కనిపిస్తోంది. జిల్లాలోని సాగు భూములు ఇలా... వివరాలు సాగువిస్తీర్ణం హెక్టార్లలో సాగుకు అనువైన భూమి : 4,72,225 ఘణపురం ఆయకట్టు : 8650 నల్లవాగు ఆయకట్టు :2408 5,005 కుంటల కింద : 15,268 637 చెరువుల కింద : 56,327 బావులు, బోరుబావుల ద్వారా : 1.38,308 వర్షాధారం : 2,51,264